Horoscope Today (25-02-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
ప్రారంభించబోయే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. దుర్గా ధ్యానం చేయండి.
వృషభం
తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన,వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.
మిథునం
మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కర్కాటకం
గ్రహబలం తక్కువగా ఉంది. శ్రమ కాస్త పెరుగుతుంది. మితంగా ఖర్చుచేయాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి మంచి భోజనం తీసుకోవాలి. నవగ్రహ శ్లోకం చదవాలి.
సింహం
శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులను మళ్ళీ ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి.
కన్య
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
తుల
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లలితా దేవి నామస్మరణ మంచిది.
వృశ్చికం
మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో నిదానమే ప్రదానం అన్న విషయాన్ని మరువరాదు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ దర్శనం శుభప్రదం.
ధనస్సు
ప్రారంభించబోయే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడు పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. శని ధ్యానం చేయండి.
మకరం
శుభకాలం నడుస్తోంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
కుంభం
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీ రామనామ జపం శుభప్రదం.
మీనం
కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26)