ETV Bharat / bharat

Horoscope Today (30-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - గ్రహం అనుగ్రహం

Horoscope Today (30-12-2021): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
రాశిఫలం
author img

By

Published : Dec 30, 2021, 4:12 AM IST

Horoscope Today (30-12-2021): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు;

మార్గశిర మాసం;బహుళ పక్షం

ఏకాదశి: ఉ. 9.44 తదుపరి ద్వాదశి

విశాఖ: రా. 9.46 తదుపరి అనూరాధ

వర్జ్యం: రా. 1.30 నుంచి 3.00 వరకు

అమృత ఘడియలు: మ.1.28 నుంచి 2.58 వరకు; దుర్ముహూర్తం: ఉ. 10.13 నుంచి 10.57 వరకు తిరిగి మ.2.36 నుంచి 3.20 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.34, సూర్యాస్తమయం: సా.5-32

మేషం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి . కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉత్తమం.

వృషభం

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవ బలం కాపాడుతోంది. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

మిథునం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగించుకోడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

సింహం

ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. మనోధైర్యం విశేషంగా ఉంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సూర్యాష్టకం చదవడం మంచిది.

కన్య

ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్నిశుభఫలితాలు పొందుతారు.

తుల

అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

వృశ్చికం

గ్రహసంపత్తి అనుకూలంగా ఉంది. అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. శివాష్టోత్తరం చదవాలి.

ధనుస్సు

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.

మకరం

మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీరామనామాన్ని జపించాలి.

కుంభం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఈశ్వరారాధన మంచిది.

మీనం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవతను ఆరాధించాలి.

ఇదీ చూడండి : డార్జిలింగ్​ను కప్పేసిన మంచు దుప్పటి.. శ్వేత వర్ణంలో చమోలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.