ఆగస్టు 9వ తేదీన ఈ మీ రాశిఫలాలు(Horoscope Today) ఎలా ఉన్నాయంటే..
మేషం
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. చంద్ర శ్లోకం చదవడం మంచిది.
వృషభం
మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉన్నది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందం గా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితలున్నాయి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.
మిథునం
విశేషమైన గ్రహసంపత్తి ఉంది. మీమీ రంగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. బంగారు భవిష్యత్తుకు వ్యూహరచన చేస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. పరిచయంలేని వారి మాటలు వినకండి. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. కలహసూచన ఉంది. దైవారాధన మానవద్దు
సింహం
ధృడమైన మనస్సుతో ముందుకు సాగండి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
కన్య
అనుకున్న పని నెరవేరుతుంది. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. లాభస్థానంలో చంద్రబలం సహకరిస్తోంది. విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం మేలు చేస్తుంది.
తుల
కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైన కాలాన్ని గడుతారు. గోసేవ చేయడం మంచిది
వృశ్చికం
చేపట్టే పనుల్లో అలసట పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
ధనుస్సు
ఉత్సాహంతో పనులను పూర్తిచేస్తారు. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్నిస్తాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
మకరం
చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మీమీ రంగాల్లో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆపదలున్నాయి ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులయందు విజయం కోసమై విష్ణు సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
కుంభం
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ఆటంకాలను అధికమించి విజయం సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చంచల స్వభావం ఇబ్బంది పెడుతుంది. శివారాధన మేలైన ఫలితాలనిస్తుంది.
మీనం
చంచల స్వభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్య విషయల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది. బంధువులతో జాగ్రత్త. చంద్ర శ్లోకం చదవాలి.