బిహార్లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్న పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు.
కిషన్గంజ్ జిల్లా సలాం కాలనీలో జరిగిన ఈ విషాద ఘటనలో తండ్రి సహా.. నలుగురు చిన్నారులు మృతి చెందారు. నూర్ ఆలం అనే వ్యక్తి ఇంటికి సమీపంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని.. సమీపంలోని మరో నాలుగు ఇళ్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బాధిత కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది బిహార్ ప్రభుత్వం.