ETV Bharat / bharat

పోలీస్​ జీప్​ ఢీకొని మహిళ మృతి.. అక్కడి డీఎస్పీ కుమారుడు అరెస్ట్! - Chennai news

Hit and run case : రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొట్టడం వల్ల.. ఓ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడు చెన్నైలో శుక్రవారం రాత్రి జరిగింది. ​వాహనం నడుపుతున్న చెన్నై డీఎస్పీ కుమారుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Hit and run case
పోలీస్​ జీపు ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Mar 6, 2022, 11:04 AM IST

Updated : Mar 6, 2022, 1:09 PM IST

Hit and run case : తమిళనాడులోని చెన్నైలో పోలీసు వాహనం ఢీకొట్టి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో.. చెన్నై క్రిమినల్​ దర్యాప్తు విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​(డీఎస్పీ) కుమారుడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

చెన్నై క్రిమినల్​ దర్యాప్తు విభాగం డీఎస్పీ కుమారన్​ కుమారుడు లోకేశ్​(21).. తండ్రికి చెందిన పోలీస్​ వాహనంలో తన తల్లిని సెంట్రల్​ రైల్వే స్టేషన్​కు తీసుకెళ్లాడు. ఆమెను స్టేషన్​లో దింపి తిరిగి వస్తున్న క్రమంలో కిల్​పౌక్​ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అమృత(30) రోడ్డు దాటుతుండగా వాహనంతో ఢీకొట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. ఆమె పెరుంగుదిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఐపీసీ సెక్షన్​ 279, 338 ప్రకారం.. లోకేశ్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకున్న కారణంగా డీఎస్పీ కుమారన్​పై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: టాటూల కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్​

Last Updated : Mar 6, 2022, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.