అసోం 15వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ(భాజపా) నాయకుడు హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జగదీశ్ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, మాజీ సీఎం శర్బానంద సోనోవాల్ సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాద్ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
126 స్థానాలు కలిగిన అసోం అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని భాజపా 60 స్థానాలు, ఏజీపీ 9, యూపీపీఎల్ ఆరు సీట్లు గెలుపొందాయి.
ఇదీ చదవండి: బంగాల్లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం