ETV Bharat / bharat

హిజాబ్​పై కర్ణాటక సర్కార్​ మరో కీలక నిర్ణయం! - కర్ణాటక వార్తలు తాజా

Hijab issue in Karnataka: కర్ణాటకలో మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్​ వంటి మతపరమైన దుస్తులు ధరించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

karnataka
కర్ణాటక
author img

By

Published : Feb 17, 2022, 11:00 PM IST

Hijab issue in Karnataka: హిజాబ్​ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు కూడా హిజాబ్​, కాషాయ కండువాలు లేక ఇతర మతపరమైన దుస్తులు ధరించడంపై నిషేధం విధించింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పేర్కొంటూ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల కర్ణాటక హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రాష్ట్రంలోని స్కూల్స్​, కాలేజీల్లో విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలను మైనార్టీ శాఖ పరిధిలోని మౌలానా ఆజాద్​ మోడల్​ స్కూల్ సహా స్కూల్స్​ కాలేజీలకు వర్తింపజేస్తూ కొత్త ఆదేశాలను విడుదల చేసింది.

మరోవైపు శివమొగ్గ జిల్లాలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా తొమ్మిది మందిపై కేసు నమోదైంది.

ఇదీ చూడండి : 'భాజపా గెలిస్తే స్టూడెంట్స్​కు స్కూటీలు, ల్యాప్​టాప్​లు ఫ్రీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.