Hi tech BlueTooth copying: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలో ఓ అభ్యర్థి హైటెక్ కాపింగ్‌కు పాల్పడ్డాడు. చెవిలో బ్లూటూత్ పెట్టుకుని పరీక్షకు హాజరయ్యాడు. అభ్యర్థి గుసగుసలాడుతున్నట్లు గమనించిన ఇన్విజిలేటర్ అతడ్ని తనిఖీ చేయగా చెవిలో ఉన్న బ్లూటూత్ వ్యవహారం బయటపడింది. దీంతో అభ్యర్థిని ఆసుపత్రికి తరలించారు. బ్లూటూత్ పరికరాన్ని బయటకు తీయించారు.
ఇదే సమాచారాన్ని పరీక్ష నిర్వాహకులు పోలీసులకు అందజేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ్లూటూత్‌ను స్వాధీనం చేసుకుని అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడ్ని అమేఠీకి చెందిన గిరిజా పాఠక్‌గా పోలీసులు గుర్తించారు. బ్లూటూత్‌ను ఎవరూ కనిపెట్టలేని విధంగా చెవి లోపలికి అమర్చినట్లు తెలిపారు. అందుకే ఆసుపత్రికి తరలించి తీసుకెళ్లి దానిని తొలగించినట్లు చెప్పుకొచ్చారు.
అమేఠీలో జరిగిన ఈ పరీక్షకు సుమారు 7,006 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి:
యూట్యూబ్ చూసి సరదాగా ప్రయోగం.. ఇప్పుడు లక్షల్లో ఆదాయం!
కార్ షోరూమ్‌లో అవమానం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు..'స్నేహం కోసం' రిపీట్!