జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మాదక ద్రవ్యాల స్మగ్లర్‌ను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కాల్చి చంపారు. అతని నుంచి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.135 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
స్మగ్లర్ సరిహద్దుకు అవతలి వైపు నుంచి వచ్చినట్లు గమనించిన సిబ్బంది.. అక్కడే నిలవాలని హెచ్చరించినా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాల్చి చంపినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
పాకిస్థాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు సులభంగా భారత్‌లోకి చొరబడేందుకు ఉన్న 150 మీటర్ల భూగర్భ సొరంగంను జనవరి 23న బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి: ఉగ్రవాద నిధుల కోసం భారత్‌లో డ్రగ్స్ దందా!