ETV Bharat / bharat

Rains in Telangana : భారీ వర్షాలకు ఓరుగల్లు వాసులు విలవిల.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ జోరు వర్షాలు - భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద ప్రవాహం

Heavy Rains in Telangana Today : విస్తారంగా కురుస్తున్న వానలు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు ఉరకలెత్తుతుండగా.. చెరువులు మత్తడి పారుతున్నాయి. ఎటు చూసినా వరద నీటితో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. త్రినగరి వరంగల్‌లో పలుకాలనీలు వరద గుప్పిట్లోనే చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ముంపు బాధితులను ఇప్పటికే ఖాళీ చేయించిన అధికారులు... పునరావాసాలకు తరలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ జోరు వర్షాలకు జలవనరులు నిండుకుండలా మారాయి. భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

Rains in Telangana
Rains in Telangana
author img

By

Published : Jul 26, 2023, 8:10 PM IST

విస్తారంగా కురుస్తున్న వానలు

Heavy Rains in Joint Warangal District : కుండపోత వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుప్రాంతాలు చివురుటాకులా వణుకుతున్నాయి. త్రినగరిలో లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. చారిత్రక నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్‌లోని డీకేనగర్, ఎన్టీఆర్‌నగర్, గణేశ్‌నగర్, సంతోషిమాతానగర్, వివేకానందకాలనీ, సుందరయ్యనగర్‌లు ముంపులోనే ఉన్నాయి. కాశీబుగ్గ పరిధిలోని పలు కాలనీల ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. భారీ వర్షాలకు నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను విపత్తు నిర్వహణ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

పాత బీట్ బజార్ వద్ద మురుగు కాల్వల్లోకి చెత్త చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దుకాణాల్లోకి డ్రైనేజ్‌ నీరు పోటెత్తుతోంది. పాత బీట్‌బజార్‌, బట్టల బజార్ ప్రాంతంలో ఏటా వర్షం వస్తే వ్యాపారాలు బంద్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వరద కాల్వలకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. బీట్‌ బజారుతో పాటు బట్టల బజార్ ప్రాంతాన్ని వరంగల్ మేయర్ గుండు సుధారాణి సందర్శించి దుకాణ యాజమానులకు భరోసా కల్పించారు. వర్షాలు తగ్గగానే కాలువల నిర్మాణ పనులు వేగంగా చేస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు.

వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో వరద నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులు, కుంటలు వర్షపునీటితో నిండుకుండల్లా మారగా.. ఇలాగే భారీ వర్షాలు పడితే చాలాచోట్ల కట్టలు తెగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హనుమకొండ-ములుగు ప్రధాన రహదారిపై ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతోంది. ప్రవాహ వేగం పెరిగినందున వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.

Rains in Mahabubabad : భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చెరువులు అలుగులు పారుతున్నాయి. గూడూరు మండలం కొమ్ముల వంచ శివారులో భీముని పాదం జలపాతం ఉద్ధృతంగా జాలువారుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం మండలాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క విస్తృతంగా పర్యటించారు. వంతెనలపై నుంచి పారుతున్న వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా ఘనపూర్‌లో మోరంచ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుద్దారంలో వంగపల్లి చెరువు అలుగుపోస్తోంది. టేకుమట్ల మండలం వెలిశాలలో చెరువు మత్తడి పోస్తోంది. సింగరేణిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

Heavy Rains in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెగని వర్షాలతో ప్రధాన జలాశయాలు, తాగునీటిప్రాజెక్టులకు వరద తాకిడి అంతకంతకు పెరుగుతోంది. ప్రాణహితతో పాటు ఎల్లంపల్లి, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ప్రవాహం 46.7 అడుగులకు చేరడంతో భద్రాచలం వద్ద జిల్లా యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గోదావరి ఉగ్రరూపంతో దుమ్ముగూడెం మండలం గంగోలు-లక్ష్మీనగరం రోడ్డుపైకి వరద చేరి...వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Floods in Godavari : భారీ వర్షం వల్ల భద్రాద్రి రాములోరి ఆలయంలో జరపాల్సిన నిత్య కళ్యాణ వేడుకను ప్రాకార మండపంలోకి మార్చి నిర్వహించారు. చర్ల మండలం కుదునూరు వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద విపత్తు వేళ ప్రత్యేక అధికారి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్.. చర్ల మండలంలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఉగ్రరూపం దాల్చిన తాలిపేరు ప్రాజెక్టును అధికారులతో కలిసి జోరువానలో ఆయన సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దండిపేట, వీరాపురం గ్రామాలను ఖాళీ చేయించాల్సిందిగా సూచించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను అనుదీప్ ఆదేశించారు.

పాలేరు, వైరా, లంకసాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో పాలేరు జలాశయం నుంచి 10,000 క్యూసెక్కుల మేర దిగువకు వదులుతున్నారు. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు జలాశయం 24 గేట్లు ఎత్తి.. 2 లక్షల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు నుంచి రెండున్నర వేల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు.

Heavy Rains in Badradri kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్‌నగర్ వద్ద.. పుణ్యపు వాగు ప్రవాహం ధాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి మండలం రాయపాడులో వంతెన పైనుంచి కిన్నెరసాని వాగు పారడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలకు మణుగూరు పట్టణంలోని పలుకాలనీల్లోకి వరద నీరు చేరింది. సుజాతనగర్ మండలంలోని ఎదుళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగూడెం సింగరేణి ఉపరితల గనిలోకి వరద చేరికతో 2,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి సిబ్బంది విద్యుత్ మోటార్ల సాయంతో నీళ్లను బయటకు తోడుతున్నారు.

ఇవీ చదవండి: Precautions On current Rain Season : అమ్మో వానాకాలం.. కరెంట్​తో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Nizamabad Rains : నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన.. వేల్పూర్‌లో గరిష్ఠంగా 46.3 సెం.మీ వర్షపాతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.