ETV Bharat / bharat

ఫోన్​ తెచ్చిందని దుస్తులు విప్పించి.. నేలపై కూర్చోబెట్టిన హెడ్​మాస్టర్​ - మాండ్యా

పాఠశాలకు సెల్​ఫోన్​ తీసుకొచ్చిందనే కారణంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని దుస్తులు విప్పించి, తీవ్రంగా కొట్టింది ప్రధానోపాధ్యాయురాలు. తోటి విద్యార్థుల ముందు బట్టలు లేకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టింది. ఈ అమానవీయ సంఘటన కర్ణాటకలోని మాండ్యాలో జరిగింది.

Headmistress forces girl student to strip
ఫోన్​ తెచ్చిందని దుస్తులు విప్పించిన హెడ్​మాస్టర్​
author img

By

Published : Jan 7, 2022, 1:57 PM IST

Updated : Jan 7, 2022, 4:31 PM IST

కర్ణాటకలోని మాండ్యలో అమానవీయ ఘటన జరిగింది. పాఠశాలకు మొబైల్​ ఫోన్​ తీసుకొచ్చిందనే కోపంతో ​ఎనిమిదో తరగతి విద్యార్థిని దుస్తులు విప్పించింది ప్రధానోపాధ్యాయురాలు. అనంతరం కర్రతో చితకబాదింది. తోటి విద్యార్థుల ముందే ఈ దారుణం జరిగింది.

విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాయురాలు అమానవీయంగా ప్రవర్తించిన ఈ సంఘటన.. శ్రీరంగ పట్టణం తాలూకాలోని గణంగూర్​ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతవారం జరిగింది. తీవ్రంగా కొట్టటం సహా బాలురను తరగతి నుంచి బయటకు పంపించి.. దుస్తులు లేకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టింది.

ఏమాత్రం కనికరం లేకుండా..

మధ్యాహ్న భోజన సమయంలో తరగతి గదికి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు.. మొబైల్​ ఫోన్​ తీసుకొచ్చినవారు తనకు ఇచ్చేయాలని అడిగారని బాధితురాలు తెలిపింది. ఫోన్​ ఇవ్వకుంటే బట్టలు విప్పించి బాలురతో తనిఖీ చేయిస్తానని బాలికలను హెచ్చరించినట్లు పేర్కొంది. కొద్ది సమయం తర్వాత బాలురను బయటకు పంపించి.. బట్టలు విప్పించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్​ తెచ్చినందుకు కర్తతో తీవ్రంగా కొట్టినట్లు తెలిపింది.

" మా స్నేహితుల ముందే నా దుస్తులు విప్పించి, కింద కూర్చోబెట్టింది. చలిగా ఉందని, దాహం వేస్తుందని చెప్పినా కనికరించలేదు. సాయంత్రం వరకు కూర్చోబెట్టింది. 4.30 గంటలకు మధ్యాహ్న భోజనం చేసేందుకు అనుమతించింది. ఆ తర్వాత 5 గంటలకు ఇంటికి వెళ్లాం."

- బాధితురాలు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు..

ఈ ఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్​ చేయాలని విద్యాశాఖకు సిఫార్సు చేసినట్లు డీడీపీఐ (డిప్యూటీ డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ ఇన్​స్ట్రక్షన్​) పేర్కొంది.

అమానవీయ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ విషయంపై తహశీల్దార్​ శ్వేత ఎన్​.రవీంద్ర పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. విద్యార్థుల పట్ల ప్రధానోపాధ్యాయురాలు కఠినంగా వ్యవహరిస్తుందని, గతంలో సస్పెండ్​ అయినట్లు తెలిసిందన్నారు.

ఇదీ చూడండి: తొమ్మిదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ల అత్యాచారం

Last Updated : Jan 7, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.