రొటీన్‌కి భిన్నంగా ట్రై చేద్దాం అనుకున్న ఓ కోతి ఏం చేసిందో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఓ టీ స్టాల్లో.. అచ్చం మనిషిలాగే కూర్చుని ప్లేట్లు, గ్లాసులు కడిగింది ఆ కోతి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
టీ స్టాల్లో ప్లేట్లు కడుగుతున్న ఓ కోతి చుట్టూ ప్రజలు గుమిగూడి.. అది చేస్తున్న పనులను ఆసక్తిగా గమనిస్తూ ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ప్లేట్లు కడుగుతూ.. వాటిని నీళ్లలో ముంచుతూ మధ్యమధ్యలో సరిగ్గా శుభ్రం చేశానా? లేదా? అని కోతి చూడటం విశేషం. ఈ వీడియో చూపరులకు నవ్వులు తెప్పిస్తోంది.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోతిని మెచ్చుకుంటుంటే, జంతుప్రేమికులు మాత్రం.. ఇది మూగజీవాలపై హింసేనని ఆరోపిస్తున్నారు. కోతిని నిర్భందించారని మరికొందరు ఆరోపిస్తూ కామెంట్లు చేశారు.
ఇవీ చదవండి: