ETV Bharat / bharat

పెళ్లయిన కొద్దిగంటలకే నవవధువుపై కాల్పులు

Haryana Bride: కొత్తగా పెళ్లై భర్తతో కారులో వెళ్తున్న నవవధువుపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Haryana Bride
భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నవవధువుపై తూటాల వర్షం
author img

By

Published : Dec 7, 2021, 2:34 PM IST

Haryana Bride: హరియాణా సోనిపత్​లోని పల్దీ గ్రామంలో నవవధువుపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. పెళ్లయిన కొద్ది గంటల తర్వాత ఆమె తన భర్త, మరో బంధువుతో కలిసి కారులో వెళ్తుండగా ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడు బాధితురాలి పక్కింటి వ్యక్తే అని తెలుస్తోంది. ఆమెను అతడు రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సమాచారం. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

20ఏళ్ల బాధితురాలు తనిష్కకు.. మోహన్​తో ఇటీవలే వివాహమైంది. బంధువుతో కలిసి ఇద్దరు కారులో భాలి-అనందపుర్ గ్రామానికి వెళ్తండగా ఎస్​యూవీ వాహనంలో వచ్చిన ముగ్గురు కారును ఆపారు. అందులో ఇద్దరు వాహనం దిగి కారు డోరు తీయమని అడిగారు. డ్రైవింగ్​ చేస్తున్న బంధువు​ డోరు తీయగానే నిందితుడు తనిష్కపై తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. అడ్డు వచ్చిన బంధువును చితకబాదాడు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి అతని వద్ద నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. డిసెంబర్ 1న ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు రోహ్తక్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నిందితుడు సాహిల్​ సహా మరో ఇద్దరు మైనర్లను ఈ కేసుకు సంబంధించి డిసెంబర్​ 5న అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనిష్కపై కాల్పులు జరపడానికి 4 గంటల ముందు నిందితులు స్థానిక వ్యాపారవేత్త ఎస్​యూవీని దొంగిలించారని చెప్పారు. ఘటన అనంతరం వాహనాన్ని ఓ దాబా సమీపంలో వదిలి వెళ్లారని వివరించారు. తాను ఇంటికి తిరిగి వస్తుండగా ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు తుపాకులతో బెదిరించి ఎస్​యూవీని దొంగిలించారని వ్యాపారవేత్త పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్​ అధికార ప్రతినిధి సురేందర్ జైన్​ స్పందించారు. బాధితురాలి గ్రామంలో రెండుసార్లు పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 'లవ్ జిహాద్' చట్టాన్ని తీసుకురావాలని గ్రామస్థులు కోరినట్లు చెప్పారు.

హరియాణా సీనియర్ పోలీసు అధికారి మాత్రం ఈ ఘటనకు ఇతర సామాజిక కారణాలు లేవని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అప్పుడే పుట్టిన పసికందును చంపి.. టాయిలెట్ ఫ్లష్​​లో వేసిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.