ETV Bharat / bharat

ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లోకి పవర్​ఫుల్​ హెలికాప్టర్లు - ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ మార్క్​ 3 హెలికాప్టర్

భారతదేశానికి మూడు వైపులా విస్తరించిన సముద్ర తీర ప్రాంత భద్రతను పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. హెచ్​ఏఎల్​ పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన తేలికపాటి ఆధునిక హెలికాప్టర్‌ మార్క్‌-3 తీర ప్రాంత రక్షణ దళంలో చేరింది. తీర ప్రాంతాన్ని పటిష్ట నిఘా నేత్రంతో కాపాడేందుకు అనేక అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ హెలికాప్టర్‌.. విపత్తుల సమయంలోనూ సేవలందించనుంది.

HAL ALH Mk-III Helicopters, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ హెలికాప్టర్లు
ఇండియన్​ కోస్ట్​ గార్డ్స్​లోకి మరో పవర్​ఫుల్​ హెలికాప్టర్​!
author img

By

Published : Jun 12, 2021, 9:20 PM IST

భారత తీర ప్రాంత రక్షణ దళ చరిత్రలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. తేలిక పాటి ఆధునిక హెలికాప్టర్‌ ఏఎల్​హెచ్​ మార్క్‌-త్రీ.. తీర ప్రాంత రక్షణ దళంలో చేరింది. దిల్లీలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, తీర ప్రాంత రక్షణ దళం డైరెక్టర్‌ జనరల్‌ కే నటరాజన్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సీఎండీ.. ఆర్‌ మాధవన్‌ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు ఏఎల్​హెచ్​ మార్క్‌-త్రీ హెలికాప్టర్‌లను కోస్ట్‌గార్డ్‌కు అందజేశారు.

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ హెలికాప్టర్‌ అనేక అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉంది. హెలికాప్టర్‌లో నిఘా రాడార్‌, ఎలక్ట్రో ఆప్టిక్‌ పాడ్‌, అధిక తీవ్రత కల్గిన గాలింపు వ్యవస్ధ, మెషిన్‌ గన్‌ కల్గి ఉంది. భారతదేశ తీర ప్రాంత నిఘా, రక్షణలో ఈ హెలికాప్టర్‌లు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం ఈ హెలికాప్టర్‌లో మెడికల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పే ఆత్మనిర్భర్‌ భారత్‌, స్ధానిక వస్తువులకు ప్రాధాన్యం అనే నినాదాలకు ఏఎల్​హెచ్​ మార్క్‌-త్రీ హెలికాప్టర్‌ తయారీ ప్రతీక అని తీర ప్రాంత రక్షక దళ డైరెక్టర్‌ జనరల్‌ కెే నటరాజన్‌ అన్నారు. సవాళ్లతో కూడుకున్న సమయాన తీరప్రాంత రక్షణ దళంలో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ మార్క్‌-3 చేరిక వల్ల నౌకా సంబంధ కార్యకలాపాల్లో కొత్త దిశ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"తీరప్రాంత రక్షక దళం వైమానిక విభాగం వృద్ధిలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నమ్మకమైన భాగస్వామి. సవాళ్లతో కూడుకున్న సమయాన తీరప్రాంత రక్షక దళంలో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ మార్క్‌-3 చేరిక వల్ల నౌకా సంబంధ కార్యకలాపాల్లో కొత్త దిశ వస్తుంది. నిఘా కార్యకలాపాలు మరింత విస్తరించి..బలోపేతం అవుతాయి."

-కే.నటరాజన్‌, డైరెక్టర్‌ జనరల్‌, తీరప్రాంత రక్షక దళం

ఏఎల్​హెచ్​ మార్క్‌-త్రీ హెలికాప్టర్‌లను భువనేశ్వర్‌, చెన్నై, పోర్‌బందర్‌, కోచీ తీరాల్లో మోహరించనున్నారు. తీర ప్రాంత రక్షక దళానికి సంబంధించిన ఇతర విధ‌ులను కూడా ఇవి నిర్వర్తించనున్నాయి.

ఇదీ చదవండి : Article 370: దిగ్విజయ్ వ్యాఖ్యలపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.