రిజర్వేషన్ వ్యవహారంలో రాజస్థాన్‌లో ఆందోళనలు చేస్తున్న గుర్జర్లు.. ఎట్టకేలకు శాంతించారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో చర్చల అనంతరం రైల్వే ట్రాక్‌లను ఖాళీ చేసి నిరసనలు ముగించారు. ఫలితంగా నేటి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి.
"ప్రభుత్వంతో బుధవారం రాత్రి చర్చలు జరిగాయి. సీఎం సూచనలకు సంఘం అంగీకరించింది. రైల్వే ట్రాక్‌లను ఖాళీ చేస్తున్నాం. ఆందోళనలను విరమిస్తున్నాం"
-- విజయ్ బైంస్లా, గుర్జర్ నాయకుడు
గుర్జర్ల డిమాండ్లివే..
- రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.
- ఖాళీల బ్యాక్‌లాగ్‌లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలి.
- 14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ ఆధారంగా వేతనాలివ్వాలి.