గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని.. మంత్రివర్గం(Gujarat Cabinet) గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు కొలువు దీరనుంది. 18 మంది ఎమ్మెల్యేలు.. మంత్రులుగా(Gujarat Cabinet) ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం(Gujarat New Cabinet Minister List) జరగనుంది.
మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంత్రివర్గంలో పని చేసిన వారిలో చాలా మందికి ఈ కొత్త మంత్రివర్గంలో(Gujarat Cabinet) ఉద్వాసన పలికినట్లు సమాచారం.
మంత్రులుగా ప్రమాణ చేసేది వీరే..
- నరేష్ పటేల్
- కానూ దేశాయ్
- హరీష్ సంఘ్వీ
- ఎ అరవింద్ రాయానీ
- కిరీట్ సింగ్ రాణా
- హృషికేశ్ పటేల్
- కీర్తిసింగ్ వాఘేలా
- బ్రిజేష్ మీర్జా
- ముఖేశ్ పటేల్
- జీతూభాయ్ చౌదరి
- ఆర్సీ మక్వానా
- రాఘవ్జీ పటేల్
- జీతూ వాఘనీ
- మనీశా
- దేవాభాయ్ మాలమ్
- జేవీ కాకడియా
- జగదీశ్ పంచల్
- గజేంద్ర సింగ్ పర్మార్
గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ(vijay rupani resignation) గత శనివారం రాజీనామా చేయడం వల్ల ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. రూపానీ వారసుడెవరు? సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు? అని సర్వత్రా చర్చలు జరిగాయి. దీనికి ముగింపు పలుకుతూ భూపేంద్ర పటేల్‌ను తదుపరి సీఎంగా ప్రకటించింది భాజపా అధిష్ఠానం. 59ఏళ్ల భూపేంద్ర.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదీ చూడండి: Gujarat Cm: ఫస్ట్‌టైం ఎమ్మెల్యే టు సీఎం.. భూపేంద్ర ప్రస్థానం
ఇదీ చూడండి: Assembly Election 2022: నాయకత్వ మార్పుతో ఎన్నికలకు సన్నద్ధం!