ETV Bharat / bharat

భర్తకు సెల్ఫీ వీడియో పంపి భార్య ఆత్మహత్య - ఆయేషా కమ్రాని ఆత్మహత్య

గుజరాత్​లో విషాద ఘటన జరిగింది. భర్తతో వివాదం కారణంగా 23ఏళ్ల యువతి సబర్మతీ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 25న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Gujarat woman ends life over marital dispute
నదిలోకి దూకి వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Feb 28, 2021, 12:58 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. 23 ఏళ్ల ఆయేషా మక్రానీ.. భర్తతో గొడవల కారణంగా కలత చెంది.. ఇలా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే?

గుజరాత్​- అహ్మదాబాద్​లోని వట్వాకు చెందిన ఆయేషా మక్రానీకి, రాజస్థాన్​ వాసి ఆరిఫ్​ఖాన్​తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే కుటుంబ వివాదాలు, వరకట్న వేధింపులు ఆమెను వెంటాడాయి. ఈ విషయమై ఆయేషా తండ్రి.. ఆరిఫ్​ఖాన్​, అతడి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయేషా కొద్దిరోజులుగా తమ తల్లిదండ్రుల వద్దే(అహ్మదాబాద్​లో) ఉంటోంది. గతంలోనూ ఓసారి ఇలాగే జరగ్గా.. ఇరు కుటుంబాల అంగీకారంతో మళ్లీ కాపురానికి వెళ్లిందామె.

Gujarat woman ends life over marital dispute
ఆరిఫ్​ఖాన్​, ఆయేషా(ఫైల్​)

పనికి వెళ్తానని..

ఈ పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన ఆయేషా.. ఈ నెల 25న పనికోసం వెళ్తానని ఇంటి నుంచి బయల్దేరింది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు తాను ఆత్మహత్య చేకుకోబోతున్నానని తల్లిదండ్రులకు ఫోన్​ చేసి చెప్పింది. ఆ పరిస్థితుల్లో వారు ఎంతచెప్పినా వినిపించుకోలేదు. అనంతరం ఓ సెల్ఫీ వీడియో తీసి.. తండ్రి, భర్త(ఆరిఫ్​)కు పంపింది. అయితే.. 'సరే.. చావు, ఆ తర్వాత వీడియో పంపు' అని భర్త రిప్లై ఇచ్చాడట. ఆ వెంటనే ఆమె సబర్మతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

వీడియో చూసిన ​ఆయేషా కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో నుంచి ఆయేషా మృతదేహాన్ని బయటకు తీశారు. తండ్రి ఫిర్యాదుతో ఆమె భర్త ఆరిఫ్​పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చదవండి: పోలీసుల కస్టడీలోని నిందితుడు ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.