ETV Bharat / bharat

ఆ జిల్లాలో 11 రోజుల్లో 113 మంది పిల్లలకు కరోనా - గుజరాత్​ కరోనా వార్తలు

కరోనా మహమ్మారి పిల్లల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఆందోళనకర పరిస్థితులు ఉన్న గుజరాత్​లో నెలన్నరలో 217 మంది పిల్లలకు కరోనా సోకింది. ఈనెలలో 11 రోజుల్లో 113 మంది పిల్లలు వైరస్​ బారిన పడ్డారు.

children affected by covid gujarat, గుజరాత్​ కరోనా వార్తలు
పిల్లలకు కరోనా
author img

By

Published : May 13, 2021, 1:03 PM IST

కరోనా విజృంభణ కారణంగా గుజరాత్​లోని ఆనంద్​ జిల్లాలో గత నెలన్నరలో 217 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్​లో 104 మందికి కరోనా సోకగా.. ఈనెల కేవలం 11 రోజుల్లో 113 మంది పిల్లలకు వైరస్​ సోకింది. ఏప్రిల్​లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 5.6 శాతం 18 ఏళ్లలోపు వారివే కావడం గమనార్హం. మే నెలలో ఇది ఆరు శాతానికి పెరిగింది.

ఇప్పటివరకు ఆనంద్​ జిల్లాలో మొత్తం 3,20,695 మందికి పరీక్షలు నిర్వహించగా 6,808 మందికి వైరస్​ ఉన్నట్లు తేలింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గత రెండు నెలల్లోనే 3,739 మందికి కొవిడ్​ సోకడం గమనార్హం.

ఇదీ చదవండి : పిల్లలపై 'కొవాగ్జిన్' ట్రయల్స్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.