Groom Wedding Vows Infront Deceased Father: కుటుంబసభ్యుల్లో ఎవరైనా దూరమైతే.. వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తుంటారు. శుభకార్యాల్లో వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొందరు వారి లోటును పూడ్చుకునేందుకు మైనపు విగ్రహాలు తయారు చేయిస్తూ కార్యక్రమాలను జరిపిస్తున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటక మైసూర్లోనూ అదే జరిగింది.
తండ్రీకొడుకుల అనుబంధానికి సాక్ష్యంగా నిలిచే ఈ సన్నివేశం మైసూర్‌లోని నంజనగూడులో కనిపించింది. చిక్కమగళూరు జిల్లా కడూరుకు చెందిన డాక్టర్ యతీశ్ తండ్రి రమేశ్.. కొవిడ్ కారణంగా గతేడాది మరణించారు. యతీశ్కు ఇటీవల అపూర్వ అనే మరో డాక్టర్‌తో పెళ్లి కుదిరింది. నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీశ్.. తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. అప్పుడే యతీశ్కు ఒక ఐడియా తట్టింది. తన తండ్రి మైనపు విగ్రహం చేయించాడు. ఆదివారం వీరి వివాహం. తండ్రి మైనపు విగ్రహం ముందే శనివారం వివాహ రిసెప్షన్ జరిగింది. కుటుంబసమేతంగా వివాహ వేడుకల్లో ఫొటోలు కూడా దిగారు. యతీశ్ తల్లి.. మైనపు విగ్రహం పక్కనే కూర్చొని పెళ్లి తంతు జరిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అచ్చం జీవం ఉన్న మనిషిని పోలిన స్టాట్యూను చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. తన తండ్రి స్వయంగా ఆశీర్వదించినట్లే ఉందని ఆనందపడిపోయాడు యతీశ్. తండ్రి మైనపు విగ్రహం ముందు కుమారుడి పెళ్లి తంతు తండ్రి మైనపు విగ్రహంతో కుటుంబసమేతంగా ఫొటోలు దిగిన డాక్టర్ యతీశ్, అపూర్వ ''మా నాన్న గతేడాది కొవిడ్‌తో మరణించారు. నేను ఆయనను మరిచిపోలేకపోతున్నాను. ఆయన లేకుండా పెళ్లి చేసుకోలేను. అప్పుడే కుటుంబంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చా. నా తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించా. ఇప్పుడు మా నాన్న మాతో ఉన్నట్లే అనిపిస్తోంది.''
- యతీశ్, వరుడు
ఇవీ చూడండి: సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం
మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు!