తన ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తున్నారన్న కారణంగా కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను కడతేర్చాడు ఓ కిరాతకుడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను ఇంట్లోని బేస్మెంట్ కింద పూడ్చిపెట్టాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. మూడేళ్ల క్రితం ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఈ దారణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..?
ఉత్తర్ప్రదేశ్, గ్రేటర్ నోయిడా, బిస్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. నిందితుడు తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. అక్కడ పనిచేసే ఓ మహిళా పోలీస్ అధికారితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నారని భావించిన నిందితుడు.. పథకం ప్రకారం ఓ పోలీస్ అధికారి సాయంతో.. భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు. ఎవరికీ తెలియకుండా వారిని ఇంట్లోని బేస్మెంట్ కింద పూడ్చిపెట్టాడు.
ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్మెంట్ కింద తవ్వగా.. అస్థిపంజరాలు బయటపడ్డాయి.
ఇదీ చదవండి: Family murder: సొంత కుటుంబాన్నే కడతేర్చిన కొడుకు