అవినీతి నిరోధక నిఘా సంస్థ కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీసీవీ) చీఫ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్రం. దీనికి అర్హత గల అభ్యర్థులు 300 పదాలకు మించకుండా వ్యాసం రాసి పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు జూన్ 7 తేదీ లోపు తమ దరఖాస్తు పంపించాలని తెలిపింది.
ప్రస్తుతం ఉన్న సీవీసీ చీఫ్ సంజయ్ కొఠారీ పదవీ కాలం వచ్చే నెలతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అఖిల భారత సర్వీసులు/ ఏదైనా సివిల్ సర్వీసులో ఉన్న వ్యక్తులు/ విజిలెన్స్‌కు సంబంధించిన విషయాల్లో 25 ఏళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొంది.
సీవీసీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సహా మరో ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లకు ఉంటారు. ఈ పదవిలో నియమితులైన రోజు నుంచి నాలుగేళ్లు పాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగుతారు. ఏది ముందైతే దాని ప్రకారం తొలగిస్తారు.
ఇదీ చూడండి: 'ప్రజా సేవ కంటే వ్యక్తిగత అజెండా ముఖ్యమా?'