భారత సైనిక దళాల రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు పడింది. వాయుసేన(Indian Air Force) కోసం అధునాతన రవాణా విమానాల(military transport aircraft) కొనుగోలుకు సంబంధించి స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది రక్షణ శాఖ. రూ.20వేల కోట్లతో కొనుగోలు చేస్తున్న 56 సీ-295 ఎండబ్ల్యూ విమానాల(c 295 mw aircraft) కాంట్రాక్ట్‌పై శుక్రవారం సంతకాలు చేసినట్లు తెలిపింది. ఈ విమానాలు.. ప్రస్తుతం వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 విమానాలను భర్తీ చేయనున్నాయి. ఈ సీ-295 ఎండబ్ల్యూ విమానం 5-10 టన్నుల బరువులను మోసుకెళ్లగలదు.
సుదీర్ఘం కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విమానాల కొనుగోలుకు రెండు వారాల క్రితమే ఆమోదం తెలిపింది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ. ఒప్పందంపై ట్వీట్ చేశారు రక్షణ శాఖ ప్రతినిధి ఏ భరత్ భూషణ్ బాబు.
-
Contract signed between #MinistryOfDefence and @AirbusDefence &Space, Spain for procurement of 56 C-295 transport aircraft for the #IAF@rajnathsingh @adgpi @PIB_India @PIBHindi @indiannavy @IAF_MCC @drajaykumar_ias @AjaybhattBJP4UK @IndiainSpain pic.twitter.com/YqgvAYKWHA
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Contract signed between #MinistryOfDefence and @AirbusDefence &Space, Spain for procurement of 56 C-295 transport aircraft for the #IAF@rajnathsingh @adgpi @PIB_India @PIBHindi @indiannavy @IAF_MCC @drajaykumar_ias @AjaybhattBJP4UK @IndiainSpain pic.twitter.com/YqgvAYKWHA
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) September 24, 2021Contract signed between #MinistryOfDefence and @AirbusDefence &Space, Spain for procurement of 56 C-295 transport aircraft for the #IAF@rajnathsingh @adgpi @PIB_India @PIBHindi @indiannavy @IAF_MCC @drajaykumar_ias @AjaybhattBJP4UK @IndiainSpain pic.twitter.com/YqgvAYKWHA
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) September 24, 2021
"భారత రక్షణ శాఖ, స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ మధ్య 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలు కాంట్రాక్టుపై సంతకాలు పూర్తయ్యాయి. "
- ఏ భరత్ భూషణ్ బాబు, రక్షణ శాఖ ప్రతినిధి
48 నెలల్లో భారత్‌కు 16 విమానాలు..
ఒప్పందంలో భాగంగా 48 నెలల్లో 16 రవాణా విమానాలను భారత్‌కు అందించనుంది ఎయిర్ బస్ డిఫెన్స్. మిగిలిన 40 ఎయిర్క్రాఫ్ట్స్ను భారత్‌లో టాటా కన్సార్టియం 10ఏళ్ల లోపు ఉత్పత్తి చేయనుంది. సైనిక విమానాన్ని భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేసే తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.
గొప్ప ముందడుగు: రతన్ టాటా
సీ-295 రవాణా విమానాల తయారీకి టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ డిఫెన్స్ జాయింట్ ప్రాజెక్టుకు ఆమోదం లభించటం.. భారత్‌లో వైమానిక ప్రాజెక్టుల ప్రారంభానికి గొప్ప ముందడుగుగా పేర్కొన్నారు టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా. ఇది భారత్‌లో పూర్తిస్థాయిలో విమానాల తయారీని బలోపేతం చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. భారత రక్షణ శాఖకు, ఎయిర్ బస్‌కు శుభాకాంక్షలు తెలిపారు రతన్ టాటా.
ఇదీ చూడండి: Indian Air Force: వాయుసేనకు 56 రవాణా విమానాలు