ETV Bharat / bharat

'రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక చట్టాలు' - agri laws news latest

దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్​ అన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకే విప్లవాత్మక సాగు చట్టాలను తెచ్చామన్నారు. ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం-కిసాన్‌) పథకం కింద దేశంలోని పది కోట్ల 75లక్షల మంది రైతులకు దాదాపు లక్షా 15వేల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని వెల్లడించారు.

Govt promoting agri sector by reforming laws: Tomar
'రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక చట్టాలు'
author img

By

Published : Mar 5, 2021, 5:16 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మరోసారి స్పష్టంచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అన్న ఆయన, రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త చట్టాలను తెచ్చామన్నారు. నాబార్డ్‌, ఆసియా పసిఫిక్‌ దేశాల గ్రామీణ, వ్యవసాయ రుణసంస్థ (APRACA) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి తోమర్‌ ఈ విధంగా మాట్లాడారు.

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం-కిసాన్‌) పథకం కింద దేశంలోని పది కోట్ల 75లక్షల మంది రైతులకు దాదాపు లక్షా 15వేల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందుచూపు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల సంపద పెరగకపోతే, దేశం మంచి ఆర్థిక వ్యవస్థను సాధించలేదనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నామన్నారు.

11 దఫాల చర్చలు

గతేడాది కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. వీటిపై ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించేందుకు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 11దఫాలుగా చర్చలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఇరువర్గాల మధ్య చర్చలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో ఏ సమయంలోనైనా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ ఈమధ్యే మరోసారి‌ స్పష్టంచేశారు. అయితే, వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని కేంద్రం సూచించిన ప్రతిపాదనపై రైతు సంఘాల నుంచే ఎటువంటి స్పందన రావడం లేదని చెప్పారు.

సుదీర్ఘకాలం పోరాటం..

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని భారతీయ కిసాన్‌ సంఘం నాయుకుడు రాకేశ్‌ టికాయిత్‌ స్పష్టంచేశారు. ఎంతకాలమైనా తన పోరును కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. పుదుచ్చేరితో సహా నాలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల ప్రచారంలోనూ రైతు సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. వ్యవసాయచట్టాలపై ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళతామని అన్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.