ETV Bharat / bharat

పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు - వారికి మాత్రమే ఛాన్స్!

Govt Job Without Exam : ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్. ఆ ఉద్యోగాలకు కేవలం ప్రైవేటు సంస్థలో పనిచేసిన అనుభవం ఉంటే చాలు. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 1:16 PM IST

Govt Job Without Taking Exams
Govt Job Without Exam

Govt Job Without Exam : మీరు ప్రైవేటు సంస్థలో ఉన్నత ఉద్యోగులా? ఎలాంటి పోటీపరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కేవలం ప్రైవేటు సంస్థలో వృత్తి నిపుణులుగా ఉద్యోగం చేసిన అనుభవం ఉంటే చాలు, ప్రభుత్వ కొలువు సాధించవచ్చు. ఆ ఉద్యోగాలు ఏమిటో, వారిని ఎవరు నియమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

నీతి అయోగ్
ఉద్యోగం :​ కన్సల్టెంట్ & సీనియర్ కన్సల్టెంట్
నీతి అయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక విధాన కమిటీ. ఇది పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను రచిస్తుంది. ప్రభుత్వ పథకాలు సరిగా అమలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తుంది. ఈ పనుల కోసం ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్నవారిని కన్సల్టెంట్​, సీనియర్​ కన్సల్టెంట్​లుగా నియమించుకుంటుంది. వీరు పథకాల అమలును పర్యవేక్షించాలి. మేజర్ ప్రోజెక్టుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కలసి పనిచేయాల్సి ఉంటుంది.

ఇన్వెస్ట్ ఇండియా
ఉద్యోగం : ఇన్వెస్ట్​మెంట్ అసోసియేట్
ఇన్వెస్ట్ ఇండియా అనేది నేషనల్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. ఈ సంస్థ భారత్​లో పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషిస్తున్నవారికి దేశంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్​మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మంత్రిత్వశాఖలతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఇన్వెస్ట్​మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు సమాయానుకూలంగా ప్రకటనలు వెలువరిస్తుంది. వివిధ రాష్ట్రప్రభుత్వాలను సమన్వయం చేస్తూ ఇన్వెస్ట్​మెంట్​లను పెంచడమే ఈ జాబ్​ రోల్ ముఖ్య ఉద్దేశం.

3. విదేశీ వ్యవహారాల శాఖ
ఉద్యోగం : కన్సల్టెంట్​
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కన్సల్టెంట్ ఉద్యోగులను నియమించుకుంటూ ఉంటుంది. జీ20 లాంటి వివిధ ప్రాజెక్టులకు కన్సల్టెంట్​ నియామకాలు చేపడుతుంటారు. మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు భారత దౌత్య అధికారుల ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది. 2015 నుంచి ఈ నియమాకాలు చేపడుతున్నారు. ఈ కన్సల్టెంట్లు వివిధ ప్రాంతాలకు సంబంధించి రీసెర్చ్ పేపర్స్​ను స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ సెమినార్లకు హాజరుకావాల్సి ఉంటుంది.

పైన వివరించిన ఉద్యోగాలకు ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించరు. కేవలం పూర్వ ఉద్యోగ అనుభవాన్ని, మేధస్సును పరిగణనలోకి తీసుకుని, కీలకమైన బాధ్యతలను వారికి అప్పగిస్తారు.

ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కోసం వెతుకున్నారా? - ఈ 8 ఉద్యోగాలపై ఓ లుక్కేయండి!

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ACIO ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.