ETV Bharat / bharat

యూపీ కోసం మళ్లీ రంగంలోకి అమిత్ షా

BJP STATE OBSERVERS: ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, గోవాలో ప్రభుత్వాల ఏర్పాటుపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ఎంపిక, ఇతర వ్యవహారాల కోసం పరిశీలకుల్ని నియమించింది.

BJP appoints Union ministers Amit Shah,
యూపీ కోసం మళ్లీ రంగంలోకి అమిత్ షా
author img

By

Published : Mar 14, 2022, 7:17 PM IST

Updated : Mar 14, 2022, 8:10 PM IST

BJP STATE OBSERVERS: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి పరిశీలకులను నియమించింది. ఉత్తర్​ ప్రదేశ్​ పరిశీలకునిగా హోంమంత్రి అమిత్ షాను ఎంపిక చేయగా.. ఉత్తరాఖండ్​కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అధిష్ఠానం పంపుతోంది.

మణిపుర్​, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, నరేంద్ర సింగ్​ తోమర్​కు అప్పగించింది. గోవాలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒక్క అడుగు దూరంలో ఆగిన భాజపా.. స్వతంత్రుల సాయంతో అధికార పీఠం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అమిత్​ షాతో పాటు సహ పరిశీలకునిగా భాజపా ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్, ఉత్తరాఖండ్ శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి సహాయం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపుర్‌ సహ పరిశీలకునిగా కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు, గోవా సహ పరిశీలకునిగా ఎల్ మురుగన్​లు కొద్దిరోజుల పాటు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

సావంత్​ వర్సెస్​ రాణె

గోవాలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్, బీఎల్​ సంతోశ్​లు గోవా చేరుకుని గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలో బరిలోకి దిగింది భాజపా. పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం సావంత్​ క్యాబినెట్​లో ఆరోగ్య మంత్రిగా పని చేసిన విశ్వజిత్​ రాణె ఈ సారి సీఎం పీఠం అధిరోహించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: Bhagwant Mann: కీలక పదవికి రాజీనామా.. మాన్​ భావోద్వేగం

Last Updated : Mar 14, 2022, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.