బంగాల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలతో ప్రజలు సతమతవుతున్నారని గవర్నర్ జగదీప్ ధనకర్ అభిప్రాయపడ్డారు. నందిగ్రామ్‌లోని కేండా మారి జల్పాయ్ గ్రామాన్ని సందర్శించారు ధనకర్. హింసాత్మక ఘటనలపై మమత దృష్టి సారించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
"కరోనా, ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో రాష్ట్రం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులపై మమత దృష్టి సారించాలని నేను కోరుతున్నాను. లక్షలాది మంది ప్రజలు సతమతమవుతున్నారు. తగిన చర్యలు చేపట్టి ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం మమత కృషి చేస్తారని నేను ఆశిస్తున్నా."
- జగదీప్ ధన్కర్, బంగాల్ గవర్నర్.
బంగాల్ ఎన్నికల్లో టీఎంసీ గెలుపొందింది. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టారు గవర్నర్.
ఇదీ చదవండి : కర్ణాటక నుంచి బైడెన్, కమలకు మాస్కులు