ETV Bharat / bharat

అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు.. ఆర్-5 జోన్ గెజిట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్​ - CRDA

CHANGES IN AMARAVATI MASTER PALN: అమరావతి రైతుల అభ్యంతరాలు, హైకోర్టు ఆదేశాలు పెడచెవిన పెడుతూ అమరావతి మాస్టర్ ప్లాన్‌లో,.. ప్రభుత్వం అడ్డగోలు మార్పులు చేసింది. రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా.. ఏకపక్షంగా 500 ఎకరాలతో R-5 జోన్ ఏర్పాటు చేస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. మళ్లీ కోర్టు తలుపుతడతామని ప్రకటించారు.

R5 ZONE
R5 ZONE
author img

By

Published : Mar 22, 2023, 7:03 AM IST

అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

CHANGES IN AMARAVATI MASTER PALN: అమరావతి రాజధాని విధ్వంసమే లక్ష్యంగా,.. వైసీపీ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించవద్దని..హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పినా.. దాన్ని సవరిస్తూ ఆర్-5 జోన్ పేరిట కొత్త నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు,కురగల్లు,.... తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలతో..R5 జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు అమలుచేసేందుకు ఆర్ధికంగా బలహీన వర్గాల వారికి.. రాజధాని ప్రాంతంలో నివాస గృహాలు ఇచ్చేందుకే ఆర్ -5 జోన్ అని ప్రభుత్వం చెప్తుండగా..ఇదంతా కుట్రని అమరావతి రైతులు మండిపడుతున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌లో... మార్పులు చేసేందుకు వీలుగా CRDA చట్టాన్ని సవరిస్తూ 2022 అక్టోబర్‌ 18న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజధాని పరిధిలోనిస్థానిక సంస్థలు, ఎన్నికైన పాలకమండళ్లు లేకపోతే,.. ప్రత్యేక అధికారుల ద్వారాగానీ,.. పర్సన్‌ ఇంఛార్జ్‌ల ద్వారాగానీ,.. లేదంటే ప్రభుత్వం తనంతతానుగా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేసేలా CRDA చట్టాన్ని సవరించారు. ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి గత అక్టోబర్‌లో.. ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. దానిపై అప్పట్లోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని.. కోరారు. ఐతే.. కోర్టుకు తెలియకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వబోమని అప్పట్లో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమని రైతులు ఆక్షేపిస్తున్నారు.

"5 సంవత్సరాల క్రితం కట్టిన టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు అందించి ప్రజలకు ఇవ్వలేని ప్రభుత్వం.. ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ఆలోచించండి. ఇక్కడ వచ్చి ఉండటానికి ఏం ఆస్కారం ఉంది. ఉద్యోగాలు లేవు, మౌలికవసతులు లేవు. రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు పొగొట్టారు. మొన్న విశాఖ రాజధాని అన్నారు. రాజధాని విశాఖ అయితే ఇక్కడ గెజిట్​ నోటీఫికేషన్లు ఇచ్చి మార్పులు చేయడం ఎందుకు. మేము పేదలకు వ్యతిరేకం మాత్రం కాదు.. కేవలం ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తుకు మాత్రమే భూములు ఇచ్చాము"-రాజధాని రైతులు

ఆర్‌-5జోన్‌ ఏర్పాటును.. రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పుల్ని అంగీకరించేదిలేదని ప్రజాభిప్రాయసేకరణలో తేల్చిచెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లోనూ CRDA ప్రతిపాదినలకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఐనా... అధికారులు వాటన్నింటినీ పెడచెవిన పెట్టారని, కోర్టులో మళ్లీ చివాట్లు తప్పవని.. రైతులు హెచ్చరిస్తున్నారు.

CRDA చట్ట ప్రకారం భూమి ఇచ్చిన రైతులు కూడా... రాజధాని నిర్మాణంలో భాగస్వాములేనని, ఒప్పందం ప్రకారం పాతికేళ్లవరకూ మాస్టర్‌ ప్లాన్‌ మార్చడానికి వీల్లేదని.. అమరావతి రైతులు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత కూడా రైతుల అంగీకారంతోనే సవరణలు చేయాలని.. వివరిస్తున్నారు. ప్రత్యేక అధికారులకు మాస్టర్‌ ప్లాన్‌పై హక్కులు, అధికారులుండవని..అలాంటప్పుడు వారి ప్రతిపాదనల ఆధారంగా CRDA నిర్ణయం తీసుకోవడం చెల్లదని స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.