Government Green Signal to Recruit Group1 Group2 Posts in AP: ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ శాఖలు, సచివాలయాల్లోని పోస్టులను ఈ భర్తీ ద్వారా చేయనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీలో భాగంగా.. 597 పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. ఇందులో సచివాలయంలోని సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు, రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్ వంటి పలు ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాలు, జోన్లు, రోస్టర్ పాయింట్ల వంటి వివరాలను ఏపీపీఎస్సీకి అందించాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
Government Green Signal to Recruit Group1 Group2 Posts in AP: గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి - govt jobs in ap

Published : Aug 28, 2023, 8:58 PM IST
|Updated : Aug 28, 2023, 9:38 PM IST
20:53 August 28
వివిధ శాఖలు, సచివాలయంలో పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి