Government CPR Training : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో అనేక మంది మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మరణాలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఈ అనూహ్య మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సీపీఆర్ టెక్నిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-
Union Health Minister Dr Mansukh Mandaviya along with MoS Prof. S P Singh Baghel and Dr Bharti Praveen Pawar participated in the launch of a nationwide awareness campaign on CPR technique in Delhi today pic.twitter.com/GIyW74WVYn
— ANI (@ANI) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Union Health Minister Dr Mansukh Mandaviya along with MoS Prof. S P Singh Baghel and Dr Bharti Praveen Pawar participated in the launch of a nationwide awareness campaign on CPR technique in Delhi today pic.twitter.com/GIyW74WVYn
— ANI (@ANI) December 6, 2023Union Health Minister Dr Mansukh Mandaviya along with MoS Prof. S P Singh Baghel and Dr Bharti Praveen Pawar participated in the launch of a nationwide awareness campaign on CPR technique in Delhi today pic.twitter.com/GIyW74WVYn
— ANI (@ANI) December 6, 2023
సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ డిసెంబర్ 6న ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలుకానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌పై శిక్షణ కల్పిస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ ఇస్తారు. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగస్వాములు అవ్వనున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం- 2021 నుంచి 2022 మధ్య గుండెపోటు వల్ల కలిగే మరణాలు 12.5 శాతం పెరిగాయి. గుండెపోటు మరణాల గురించి ఇటీవలే మాండవీయ మాట్లాడారు. కొవిడ్-19 కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడమే మంచిదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనాన్ని వెల్లడించారు.
గుజరాత్‌లో గుండెపోటుతో 1052 మరణాలు
గుజరాత్‌లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1052 మంది మృతి చెందినట్లు ఇటీవలే అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసువారే. ఇలా గుండెపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్(CPR)పై అవగాహన కల్పించేందుకు దాదాపు 2లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
India Defeat Fans Death : ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సొంతగడ్డపై భారత్ ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఇద్దరు అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్.. ఆదివారం(నవంబర్ 19న) జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూస్తూ.. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
16వేల హార్ట్ సర్జరీలు చేసిన డాక్టర్‌కు గుండెపోటు.. 41ఏళ్లకే మృతి
Delhi Air Pollution Today : దిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు