ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని గోసాయ్‌గంజ్ (Gosaiganj MLA) నియోజకవర్గ ఎమ్మెల్యే(భాజపా) ఇంద్ర ప్రతాప్ తివారీకి (Indra Pratap Tiwari MLA) ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నకిలీ మార్కుల పత్రంతో కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నందుకు స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఆయనకు రూ.8 వేల జరిమానా సైతం విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకొని జైలుకు పంపించారు. (Indra Pratap Tiwari Khabbu Tiwari)
తివారీపై నమోదైన ఈ కేసు ఈ నాటిది కాదు. అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామ్ త్రిపాఠి.. 1992లో ఈయనపై కేసు పెట్టారు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినప్పటికీ.. తప్పుడు మార్క్‌షీట్‌తో తర్వాతి ఏడాదికి అడ్మిషన్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. రామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు కాగా.. 13 ఏళ్ల తర్వాత ఛార్జ్‌షీట్ పూర్తైంది. (BJP MLA in UP)
విచారణ సమయంలో.. ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ త్రిపాఠి సైతం మరణించారు. చాలా వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలు కనిపించకుండా పోయాయి. పత్రాల జిరాక్సులు, సెకండరీ కాపీలతోనే న్యాయస్థానంలో విచారణ జరిగింది. సాకేత్ కళాశాల అప్పటి డీన్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌తో పాటు మరికొందరు... తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.
ఇదీ చదవండి: ఆ ఎన్నికల్లో 40% టికెట్లు మహిళలకే: ప్రియాంక