ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్​!

author img

By

Published : Jun 19, 2021, 6:40 AM IST

ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్​ కల్పిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం.. ఆ రాష్ట్ర హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి ఇదివరకే ముసాయిదా నోటిఫికేషన్​ విడుదల చేసినట్లు వివరించింది.

transgenders
ట్రాన్స్​జెండర్లు

ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్​ కల్పిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది.

ట్రాన్స్​జెండర్లు, హెచ్​ఐవీ బాధితుల సంక్షేమం కోసం పనిచేసే సంగమ వాలంటరీ ఆర్గనైజేషన్​ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ట్రాన్స్​జెండర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్​ కల్పిచాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది విజయ్​కుమార్​ పాటిల్​.. హైకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్​ కూడా జారీ చేసిందని వివరించారు.

వాదనలు విన్న బెంచ్​.. తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: PM Modi: 66 శాతం మంది మోదీకే జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.