ETV Bharat / bharat

విమానాశ్రయంలో రూ.కోటి విలువైన బంగారం పట్టివేత - బంగారం సీజ్​

దుబాయ్​ నుంచి దేశంలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు కస్టమ్స్​ అధికారులు. సుమారు రూ.కోటి విలువైన పసిడిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. దిల్లీలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

Gold smuggling
విమానాశ్రయంలో రూ.కోటి విలువైన బంగారం పట్టివేత
author img

By

Published : Jan 10, 2022, 11:19 AM IST

దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 2330 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్​ అధికారులు. అంతర్జాతీయ మార్కెట్​లో దీని విలువ రూ.కోటికిపైగా ఉంటుందని తెలిపారు.

శనివారం ఉదయం దుబాయ్​ నుంచి దిల్లీ చేరుకున్న వ్యక్తి వద్ద అక్రమ బంగారం ఉన్నట్లు అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు. బంగారం గొలుసులను నడుముకు కట్టుకుని తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారు గొలుసులను స్వాధీనం చేసుకుని, స్మగ్లర్​ను అరెస్ట్​ చేశారు. గతంలో నాలుగు సార్లు బంగారాన్ని తరలించినట్లు ఒప్పుకున్నాడు.

నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం అధికారులు. బిహార్​లోని తూర్పు చంపారన్​ జిల్లాలోని మోతిహారీకి చెందిన రసాల్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేశారు. అతని దగ్గరి నుంచి రూ.2.98 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

Gold smuggling
నకిలీ కరెన్సీ

నకిలీ నోట్లపై సమాచారం అందిన క్రమంలో ఏసీపీ అతర్​ సింగ్​ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక విభాగం డీసీపీ జస్మీత్​ సింగ్​ తెలిపారు. దక్షిణ దిల్లీలోని సరాయ్​ కాలే ఖాన్​ బస్​ టర్మినల్​ సమీపంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. నిందితుడిని పట్టుకని.. ప్రశ్నించగా నేపాలీ వ్యక్తి నుంచి తీసుకొచ్చినట్లు తెలిపాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

Gold smuggling
దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం

ఇదీ చూడండి: ఎయిర్ ​ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్​- కారణం ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.