ETV Bharat / bharat

కరోనాతో పోరాడి ఓడిన ధీర యువతి - girl death in socila medai viral

కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటీ.. బెడ్​ మీద పాటలు వింటూ ఆనందంగా కనిపించిన యువతి ఇకలేరు. గతవారం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయి ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన ఆమె.. కొవిడ్​తో పోరాడి కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి నెటిజన్లు ఆవేదనకు గురవుతూ పోస్టులు పెడుతున్నారు.

girl in love you zindag
ఆ ధీర యువతి గుండె ఆగిపోయిందిక!
author img

By

Published : May 14, 2021, 3:37 PM IST

ముక్కుకు ఆక్సిజన్‌ పైపు.. చేతికి సెలైన్‌ ఉన్నా.. ఆసుపత్రి బెడ్‌ మీద పాటలు వింటూ ఆనందంగా కన్పించిన యువతి గుర్తుందా. గత వారం సోషల్‌మీడియాలో వైరల్‌ అయి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన ఆమె.. కరోనా ముందు ఓడిపోయింది. కొవిడ్‌పై చేసిన పోరాటంలో ఆ ధైర్యమైన గుండె ఆగిపోయింది.

ఎంతో ధైర్యంగా..

దిల్లీకి చెందిన డాక్టర్‌ మోనిక గతవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. కరోనా సోకిన ఓ యువతికి ఐసీయూ బెడ్‌ దొరక్కపోవడంతో సదరు ఆసుపత్రి సిబ్బంది కొవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. రెమ్‌డెసివిర్‌, ప్లాస్మాథెరపీతో పాటు ఎన్‌ఐవీ సపోర్ట్‌ అందించారు. సాధారణంగా అలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఎవరైనా భయపడతారు.. కుంగిపోతారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా కన్పించింది. పాటలు వినాలని ఉందంటే డాక్టర్లు అందుకు ఒప్పుకున్నారు. బెడ్‌పై ఫోన్లో 'లవ్‌ యూ జిందగీ' పాట వింటూ చిరునవ్వులు చిందించిన ఆమె వీడియోను డాక్టర్‌ మోనిక మే 8న పోస్ట్‌ చేయగా.. ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

పరిస్థితి విషమించగా..

అయితే నాలుగు రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం వల్ల ఐసీయూలో చేర్చారు. ఈ విషయాన్ని డాక్టర్‌ మోనిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. "ఆ ధైర్యమైన యువతి కోసం అందరూ ప్రార్థించండి. కొన్ని సార్లు మనం చాలా నిస్సహాయులమవుతాం. మన చేతుల్లో ఏమీ ఉండదు. అంతా భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రార్థనలేమీ ఫలించలేదు. చికిత్స పొందుతూ గురువారం ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. "చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం" అని డాక్టర్‌ మోనిక నిన్న ట్విటర్‌ ద్వారా యువతి మరణవార్తను తెలియజేశారు. ఈ ట్వీట్‌ను చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. "గుండె పగిలే వార్త ఇది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి" అంటూ బాధాకర పోస్ట్‌లు పెడుతున్నారు.

  • She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
    Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG

    — Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

ఇదీ చూడండి: దృఢ సంకల్పంతో కరోనాను జయించిన కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.