Girl Burnt Alive From Lamp: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా భలుదుంగురి గ్రామంలో సోమవారం రాత్రి విషాద ఘటన జరిగింది. కిరోసిన్ దీపం వెలిగిస్తుండగా ఓ యువతి దుస్తులకు మంటలు అంటుకుని సజీవ దహనం అయ్యింది. మృతురాలిని స్వప్నేశ్వరి ముందాగా గుర్తించారు.
Odisha Girl Burnt Alive News:
స్వప్నేశ్వరి లాహునిపాడులో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. సోమవారం రాత్రి ఇంట్లో కిరోసిన్ దీపం వెలిగిస్తుండగా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. స్వప్నేశ్వరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Dog eats dead body: మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న వీధికుక్క