ETV Bharat / bharat

అపార్ట్​మెంట్​లో గంజాయి పెంచుతున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. యూట్యూబ్​లో నేర్చుకుని మరీ..

సాధారణంగా అడవుల్లో, తోట్లలో గంజాయిని పెంచడం చూస్తుంటాం. అయితే తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు మాత్రం అక్రమంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ganja plant in apartment
ganja plant in apartment
author img

By

Published : Mar 3, 2023, 10:07 PM IST

తమిళనాడులోని చెన్నైకు చెందిన నలుగురు వ్యక్తులు ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు. పండిన గంజాయిని పబ్బుల్లో, రిసార్టుల్లో విక్రయించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి సహా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. నిందితులు ఈ మొక్కలను ఇంట్లోనే పెంచేందుకు విదేశాల పరికరాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఓ ఇంజినీర్​ మరో ముగ్గురు సహాయంతో ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శక్తివేల్ అనే వ్యక్తి చెన్నైలో ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో వచ్చిన డబ్బును శక్తివేల్​ క్రిప్టోకరెన్సీగా మార్చుకుని వ్యాపారం చేసేవాడు. అతడు వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో అక్రమంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశాడు శక్తివేల్​. ఇంట్లోనే గంజాయిని పండించాలని నిశ్చయించుకున్నాడు. గంజాయి సాగు కోసం యూట్యూబ్​లో చూసి తెలుసుకున్నాడు. అలాగే డార్క్ వెబ్​సైట్​లో.. విదేశాల నుంచి కొరియర్ ద్వారా గంజాయిని పండించే పరికరాలు, విత్తనాలు కొనుగోలు చేశాడు.

ఆ తర్వాత మాడంబాక్కం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. అందులో ఖరీదైన గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా, గంజాయి వాసన రాకుండా అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశాడు. మొక్కలకు సూర్యరశ్మి తగలనందున ప్రత్యేక లైట్​ సెట్టింగ్​ను పెట్టాడు. అంతేకాకుండా పండిన గంజాయిని ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి నాణ్యమైన గంజాయిగా తయారుచేసి విక్రయాలు జరిపేవాడు శక్తివేల్​.

ganja plant in apartment
ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు

అయితే ఆన్​లైన్​లో వీటిని విక్రయించేందుకు రైల్వే ఉద్యోగులైన శ్యామ్ సుందర్, నరేంద్రకుమార్, శ్రీకాంత్‌ల సాయం తీసుకున్నాడు శక్తివేల్​. వీరు ముఖ్యంగా స్కూళ్లు​, కాలేజీలు​, పబ్బులను టార్గెట్​ చేసుకుని గంజాయిని అమ్మేవారు. ఒక గ్రాము గంజాయిని రూ.1,000 నుంచి రూ.1,500 వరకు విక్రయించేవారు. గత 4 ఏళ్లుగా ఇంటి వద్ద గంజాయి మొక్కలను పెంచి విక్రయిస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడించారు శక్తివేల్. శక్తివేల్ గంజాయి సాగు చేస్తున్న ఇంటిలో నుంచి 10కి పైగా గంజాయి మొక్కలు, 356 మందు బిళ్లలు, 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ganja plant in apartment
ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు

గత కొంత కాలంగా పబ్బుల్లో, రిసార్టుల్లో గంజాయి, డ్రగ్స్​ను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆదే సమయంలో ఓ పబ్​లో ఒక అనుమానుతుడిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో అరెస్టయిన వ్యక్తిని విచారించగా మాడంబాక్కంలోని తలదాచుకున్న శక్తివేల్​ గ్యాంగ్ గురించి పోలీసులకు వెల్లడించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు శక్తివేల్​ ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.