ETV Bharat / bharat

Gangs of Wasseypur: 'అతడ్ని చంపింది నేనే.. ఆరు నెలల్లో వారందరినీ లేపేసి...' - ఫహీమ్ ఖాన్​కు ప్రిన్స్ ఖాన్ వార్నింగ్

'ఆ హత్య చేసింది నేనే.. ఆరు నెలల్లో మిగతా వాళ్లందరినీ లేపేస్తా' అంటూ గ్యాంగ్​స్టర్ ప్రిన్స్​ఖాన్​ హెచ్చరించిన ఓ వీడియో(Prince khan video)​ .. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఝార్ఖండ్​లోని వాసేపుర్​ గ్యాంగ్​స్టర్(Gangs of Wasseypur) ఫహీమ్ ఖాన్​కు సన్నిహితుడైన నన్హే ఖాన్​ను తానే హత్య చేశానని ఆ వీడియోలో ప్రిన్స్​ ఖాన్​ చెప్పాడు.

Gangs of Wasseypur:
గ్యాంగ్స్ ఆఫ్​ వాసేపుర్​
author img

By

Published : Nov 25, 2021, 10:52 PM IST

ఝార్ఖండ్​ ధన్​బాద్​ జిల్లాలో 'గ్యాంగ్స్ ఆఫ్​ వాసేపుర్'(Gangs of Wasseypur) ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఠాల మధ్య గొడవతో అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఇంటర్నెట్​లో వైరల్​గా మారిన ఓ వీడియో.. అక్కడ జరుగుతున్న అరాచకాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆ వీడియోలో.. ఇటీవల హత్యకు గురైన నన్హే ఖాన్​ను తానే హత్య చేశానని​ వాసేపుర్​​ గ్యాంగ్​స్టర్ ఫహీమ్ ఖాన్​(Gangster faheem khan) అల్లుడు ప్రిన్స్​ ఖాన్ చెప్పాడు.

ఫహీమ్ ఖాన్​కు అత్యంత సన్నిహితుడైన నన్హే ఖాన్​ బుధవారం హత్యకు(nanahe khan shot dead) గురయ్యాడు.

ప్రిన్స్ ఖాన్ వైరల్ వీడియో

'ఆరు నెలల్లో అందరినీ..'

నన్హే ఖాన్ హత్య తర్వాత కొన్ని గంటలకు .. ప్రిన్స్ ఖాన్ వీడియో(Prince khan video)​ విడుదల చేశాడు. అందులో ఫహీమ్​ ఖాన్​తో కలిసి పని చేసేవారందరినీ తాను చంపుతానని ప్రిన్స్ ఖాన్ హెచ్చరించాడు. రానున్న ఆరు నెలల్లో వాసేపుర్​లో తమ ప్రత్యర్థి శకం ముగుస్తుందని చెప్పాడు. ధన్​బాద్​లో బుధవారం పట్టపగలు నన్హేఖాన్ హత్యకు గురవ్వగా.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్ నేర వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

తన సన్నిహితుడు లాలా హత్యకు ప్రతీకారంగానే తాను నన్హేఖాన్​ను ​హత్య చేశానని వీడియోలో ప్రిన్స్​ ఖాన్ చెప్పాడు. లాలా వ్యాపారంలో తాను పెట్టుబడులు పెట్టిన విషయం తెలుసుకుని, తన ప్రత్యర్థులు లాలాను హత్య చేశారని ప్రిన్స్ ఖాన్ ఆరోపించాడు. తన ఆస్తులను స్వాధీనం చేసుకుని తనకు హాని కలిగించేందుకు ఫహీమ్ ఖాన్ యత్నించాడని అన్నాడు. ఈ వ్యవహారం మొత్తానికి తాను సూత్రధారిని కాదని అన్నాడు. ఫహీమ్ ఖాన్​కు సన్నిహితుడైన కారణంగానే తాను నన్హే ఖాన్​ను హత్య చేశానని చెప్పాడు. ఇకపై ధన్​బాద్​లో ఫహీమ్ ఖాన్​, అమన్ సింగ్​ పాలనను కొనసాగనివ్వనని వీడియోలో ప్రిన్స్ ఖాన్ అన్నాడు.

ఇదీ చూడండి: కత్తులతో దోపిడీ ముఠా హల్​చల్​- ఛేజ్​ చేసి పట్టుకున్న ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.