మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో టాయిలెట్ విషయంలో వివాదం తలెత్తి ఓ కుటుంబంపై మరో కుటుంబానికి చెందిన సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే తమ పొలంలో మలవిసర్జన చేయొద్దన్నందుకే దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని అమంచి తండా గ్రామంలో దేవిలాల్ సిల్లోడ్ కుటుంబానికి కొంత పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన శిందే కుటుంబంలోని కొందరు పిల్లలు సిల్లోడ్ కుటుంబానికి చెందిన పొలంలోనే నిత్యం మలవిసర్జన చేస్తుంటారు. అయితే దీనిని సిల్లోడ్ కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. తమ పొలంలో టాయిలెట్‌కు రావొద్దని హెచ్చరించారు.
అయితే శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తమ పిల్లలను మలవిసర్జన చేయొద్దన్నందుకు సిల్లోడ్ కుటుంబసభ్యులపై పది మంది శిందే కుటుంబీకులు దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుల్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే తీవ్ర గాయాలతో ఇద్దరు చనిపోయారు. మృతులను సుమన్ భాయ్ సిల్లోడ్, మంగేశ్ సిల్లోడ్గా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. శిందే కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: దొంగల బీభత్సం.. 17 ఏటీఎంలు క్లోజ్.. గ్రామస్థులకు తిప్పలు!
రోడ్లపై జంతువులు హల్చల్.. వృద్ధుడు మృతి.. చిన్నారికి గాయాలు