ETV Bharat / bharat

'గంభీర్ ఫౌండేషన్ ఔషధాల నిల్వ నిజమే' - Gambhir's foundation unauthorisedly stocking, distributing COVID medicines

భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్​కు చెందిన ఫౌండేషన్.. ఫాబిఫ్లూ ఔషధాలను అనధికారికంగా కొనుగోలు చేసి పంపిణీ చేసిన విషయాన్ని దిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ అధికారి ధ్రువీకరించారు. ఈ ఫౌండేషన్​పై తక్షణమే చర్యలు తీసుకుంటామని దిల్లీ హైకోర్టుకు వివరించారు.

Gambhir's foundation unauthorisedly stocking, distributing COVID medicines
గంభీర్ ఫౌండేషన్ ఔషధాల నిల్వ
author img

By

Published : Jun 3, 2021, 3:07 PM IST

కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే ఫాబిఫ్లూ ఔషధాలను భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్​కు చెందిన ఫౌండేషన్ అనధికారంగా నిల్వ చేసిందని దిల్లీ హైకోర్టుకు.. దిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ అధికారి తెలిపారు. అనధికారంగా ఔషధాలను సేకరించి పంపిణీ చేసినట్లు తేలిందని స్పష్టం చేశారు. ఆలస్యం చేయకుండా గంభీర్ ఫౌండేషన్​పై చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించారు.

ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ సైతం ఇదే తరహా నేరానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు దిల్లీ డ్రగ్ కంట్రోలర్. తమ దృష్టికి వచ్చిన ఇలాంటి కేసులన్నింటిపైనా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కేసుల పురోగతిపై ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందజేయాలని డ్రగ్ కంట్రోలర్​ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను జులై 29కి ధర్మాసనం వాయిదా వేసింది.

కేసు ఇదీ!

దేశంలో కొవిడ్​ ఔషధాల కొరత ఉన్న సమయంలో రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న విషయంపై విచారణ చేపట్టాలని డ్రగ్​ కంట్రోలర్​ను మే 24న ఆదేశించింది దిల్లీ హైకోర్టు. గంభీర్​ మంచి ఉద్దేశంతో ఔషధాలు కొనుగోలు చేసి ఉంటారని, కానీ, అనాలోచితంగా తప్పు చేశారని ఆ సందర్భగా వ్యాఖ్యానించింది. అలాగే.. ఆప్​ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్​, ప్రవీణ్​ కుమార్​పై వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వ డ్రగ్​ కంట్రోలర్​ను ఆదేశించింది కోర్టు.

ఇదీ చదవండి- 'కోర్టునే మోసం చేయాలని చూస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.