G20 Summit Kharge Rahul : దేశ రాజధాని దిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. "ప్రతిపక్ష నేతను ఆహ్వానించకూడదని వారు(కేంద్ర ప్రభుత్వం) ముందే నిర్ణయించుకున్నారు. భారతదేశ జనాభాలో 60 శాతం మందికి నాయకులైన వారిని పట్టించుకోరు. అసలెందుకు వారు అలా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి" అని రాహుల్ అన్నారు.
-
VIDEO | "They have decided not to invite the Leader of Opposition. It tells you that they don't value the leader of 60 per cent of India's population," says Congress MP @RahulGandhi on party president Mallikarjun Kharge not being invited to G20 dinner hosted by the President. pic.twitter.com/9rxSvW76o3
— Press Trust of India (@PTI_News) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "They have decided not to invite the Leader of Opposition. It tells you that they don't value the leader of 60 per cent of India's population," says Congress MP @RahulGandhi on party president Mallikarjun Kharge not being invited to G20 dinner hosted by the President. pic.twitter.com/9rxSvW76o3
— Press Trust of India (@PTI_News) September 8, 2023VIDEO | "They have decided not to invite the Leader of Opposition. It tells you that they don't value the leader of 60 per cent of India's population," says Congress MP @RahulGandhi on party president Mallikarjun Kharge not being invited to G20 dinner hosted by the President. pic.twitter.com/9rxSvW76o3
— Press Trust of India (@PTI_News) September 8, 2023
'దేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం..'
దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీలు.. దాడికి గురవుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతదేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అధికారం, సంపద కేంద్రీకృతం కావాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్.. బ్రస్సెల్స్‌లోని ప్రెస్‌క్లబ్‌లో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
-
VIDEO | "The democratic structures of the country are under attack from a group of people who are running India," says Congress leader @RahulGandhi while interacting with international media at Brussels Press Club, Belgium. pic.twitter.com/iLp3PnJL7F
— Press Trust of India (@PTI_News) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "The democratic structures of the country are under attack from a group of people who are running India," says Congress leader @RahulGandhi while interacting with international media at Brussels Press Club, Belgium. pic.twitter.com/iLp3PnJL7F
— Press Trust of India (@PTI_News) September 8, 2023VIDEO | "The democratic structures of the country are under attack from a group of people who are running India," says Congress leader @RahulGandhi while interacting with international media at Brussels Press Club, Belgium. pic.twitter.com/iLp3PnJL7F
— Press Trust of India (@PTI_News) September 8, 2023
'ఆర్టికల్ 370పై కాంగ్రెస్ వాదన స్పష్టం'
Congress Article 370 : "ఆర్టికల్ 370పై మా వాదన స్పష్టంగా ఉంది. మన దేశంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అందుకే తమ భావాలను తెలిపేందుకు అందరినీ అనుమతించాలని మేం అనుకుంటున్నాం. కశ్మీర్ అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అక్కడ శాంతి నెలకొనాలని భావిస్తున్నాం" అని రాహుల్ తెలిపారు.
'హింస విపరీతంగా పెరుగుతోంది..'
Rahul On Democracy : దేశంలో ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తిస్థాయి దాడి జరుగుతోందని.. అది అందరికీ తెలుసు అని రాహుల్ అన్నారు. వివక్ష, హింస విపరీతగా పెరుగుతోందని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రతిపక్షాలన్నీ ఏకీభవిస్తున్నాయిని తెలిపారు.
Rahul Gandhi Europe Tour : భారత్‌లో నవాబ్ కావడానికి.. విదేశీ శక్తుల సహాయం కోరుతూ రాహుల్ విదేశాలకు వెళ్తున్నారని గతంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆ సమయంలో వారు చాలా ఆందోళన చెంది అలాంటి వ్యాఖ్యలు చేశారని రాహుల్ తెలిపారు. భారత్- ఐరోపా సంబంధాలు, మారుతున్న వాతావారణ పరిస్థితులు, ఆర్థిక సవాళ్లపై కొందరు ఐరోపా పార్లమెంటేరియన్లతో తాను ఫలప్రదమైన చర్చలు జరిపానని ఆయన చెప్పారు.
Rahul Europe Visit : అయితే, జీ-20 సమావేశాల వేళ రాహుల్ ఐరోపా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. పలు దేశాల అధినేతలు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో రాహుల్ విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఆయన భారత్‌లో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ.. విదేశాల్లో పర్యటించారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
'4 నెలలుగా మణిపుర్ తగలబడుతుంటే.. పార్లమెంట్లో మోదీ జోకులా?'
'చైనా ఆక్రమణలో భారత భూభాగం'.. రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. కేంద్ర మంత్రి కౌంటర్