G20 Summit 2023 Delhi Decoration : జీ20 శిఖరాగ్ర సమావేశాలకు హస్తిన అందంగా ముస్తాబవుతోంది. అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చేలా విమానాశ్రయం నుంచి బసచేసే హోటళ్ల వరకు కేంద్ర ప్రభుత్వం.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో దిగే జీ20 అతిథులు.. ప్రత్యేక కౌంటర్ల ద్వారా తనిఖీలు పూర్తిచేసుకుని వేగంగా బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. హోటళ్లలో సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆతిథ్యం, బస ఏర్పాటు చేశారు.
ఆకట్టుకుంటున్న హోర్డింగ్‌లపై స్లోగన్లు..
G20 summit 2023 Delhi Preparation : దిల్లీ వీధుల్లో అతిథులను ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ చిత్రాలతో ఏర్పాటు చేసిన బిల్ బోర్డులు, హోర్డింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఆయా బిల్ బోర్డులు, హోర్డింగ్‌లపై రాసిన స్లోగన్లు వైవిధ్యంగా ఉండడం సహా భారత ప్రభుత్వ ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నాయి. భూగ్రహాన్ని కాపాడే పరిష్కారాలను కలిసి సాదిద్దామని ఒక చోట పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రగతి, ప్రతి ఒక్కరి నమ్మకం, ప్రతి ఒక్కరి కృషి కోసం కలిసి పనిచేద్దామని మరో చోట రాశారు. ప్రజలకు అనుకూలమైన అభివృద్ధి నమునాను నిర్మిద్దామని ఇంకో హోర్డింగ్‌పై రాశారు.
ఎటు చూసినా మువ్వెన్నెల జెండాలు..
Delhi Roads Decoration G20 Summit : దిల్లీ వీధుల్లో ఎటు చూసినా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాలమ్ ఎయిర్ పోర్ట్ వెలుపల కూడళ్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రహదారి పక్కన, కూడళ్ల మధ్య నెలువెత్తు సింహాల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. విమానాశ్రయం వెలుపలి కూడలిలో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి జీ20 సదస్సుకు ఆహ్వానం అంటూ ప్రత్యేక వీడియోలను ప్రదర్శిస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని చాటే శిల్పాలు, కళాకృతులు పాలం విమానాశ్రయం సమీపంలో ఆకట్టుకుంటున్నాయి. వివిధ కూడళ్లలో ఫౌంటెయిన్లకు ఆధ్యాత్మికతను జోడిస్తూ శివలింగాలను సైతం ఏర్పాటు చేశారు.
వాద్య పరికరాల శిల్పాలను..
Bharat Mandapam G20 : భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రతీకలైన వివిధ వాద్య పరికరాల శిల్పాలను సైతం జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేశారు. జీ20 ప్రధాన సదస్సు జరగనున్న భారత్ మండపం సమీపంలో భైరవ్ రోడ్డులో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా సంగీత వాద్య పరికరాల విశిష్టతలను విగ్రహాల ముందు భాగంలో వివరంగా రాశారు.
భారీ సంఖ్యలో బలగాలు..
G20 Summit 2023 Security : ఇక జీ20 సమావేశాల నిమిత్తం కనీవినీ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో మోహరించిన బలగాలు.. వేదిక సమీపంలోని ప్రాంతాలను అణువణువు నిరంతరం తనిఖీ చేస్తున్నాయి. పనిచేయని సీసీ కెమెరాలను.. సిబ్బంది హుటాహుటిన మారుస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని సోదాలు చేస్తున్నారు.
-
#WATCH | Preparations & security checks underway in Delhi for the upcoming G20 Summit that is scheduled to be held here on September 9-10.
— ANI (@ANI) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from Raj Ghat area) pic.twitter.com/p2DjLaiZ80
">#WATCH | Preparations & security checks underway in Delhi for the upcoming G20 Summit that is scheduled to be held here on September 9-10.
— ANI (@ANI) September 7, 2023
(Visuals from Raj Ghat area) pic.twitter.com/p2DjLaiZ80#WATCH | Preparations & security checks underway in Delhi for the upcoming G20 Summit that is scheduled to be held here on September 9-10.
— ANI (@ANI) September 7, 2023
(Visuals from Raj Ghat area) pic.twitter.com/p2DjLaiZ80