G20 Security Delhi : లక్షా 30 వేల మంది భద్రతా సిబ్బంది... యుద్ధ విమానాలు... రాడార్లు... బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... వందలాది డ్రోన్లు... వేలాది సీసీ కెమెరాలు... కఠిన ఆంక్షలు... డేగ కళ్లు... ఏంటి ఇదేమైనా యుద్ధానికి సన్నాహకమా అనుకుంటున్నారు కదూ! కాదు. జీ 20 సదస్సు జరగనున్న వేళ దేశ రాజధాని దిల్లీలో ( G20 Delhi Closed ) కనివినీ ఎరుగని పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. చీమ చిటుకుమన్నా పసిగట్టేలా ఆకాశంలో అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే నేలమట్టం చేసేలా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భద్రతా సిబ్బంది, వేలాది సీసీ కెమెరాలు, వందలాది డ్రోన్లు, పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను మోహరించారు. క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం హైఅలర్ట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాధినేతలు తరలిరానున్న వేళ వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.
జీ20 సదస్సు జరగనున్న వేళ వాహన రాకపోకలు సహా అనేక ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దేశ రాజధానిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై నిషేధం విధించారు. క్లౌడ్ కిచెన్, ఫుడ్ డెలివరీ, అమెజాన్ డెలివరీ సహా ఎలాంటి ఆన్‌లైన్ డెలివరీలను అనుమతి లేదని దిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సురేందర్‌యాదవ్ తెలిపారు. అయితే దిల్లీలో లాక్‌డౌన్ ( G20 Delhi Lockdown ) విధిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 అర్ధరాత్రి వరకు దిల్లీలోకి వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంటుందని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
-
Here's an inside view of the International Media Centre as it stands ready to welcome media persons for the upcoming #G20Summit.
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🎥Watch as we take you on a walkthrough!#G20Summit2023 #G20India #G20India2023 #G20SummitDelhi@g20org @MEAIndia @G20_Bharat @DrSJaishankar… pic.twitter.com/qrR8Mt6XZn
">Here's an inside view of the International Media Centre as it stands ready to welcome media persons for the upcoming #G20Summit.
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 4, 2023
🎥Watch as we take you on a walkthrough!#G20Summit2023 #G20India #G20India2023 #G20SummitDelhi@g20org @MEAIndia @G20_Bharat @DrSJaishankar… pic.twitter.com/qrR8Mt6XZnHere's an inside view of the International Media Centre as it stands ready to welcome media persons for the upcoming #G20Summit.
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 4, 2023
🎥Watch as we take you on a walkthrough!#G20Summit2023 #G20India #G20India2023 #G20SummitDelhi@g20org @MEAIndia @G20_Bharat @DrSJaishankar… pic.twitter.com/qrR8Mt6XZn
మెట్రో సేవలు ఇలా...
Delhi G20 Metro Services : మరోవైపు జీ20 సమ్మిట్ సందర్భంగా మెట్రోసేవలు నిలిపేస్తారన్న ఊహగానాలను దిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ కొట్టిపారేశారు. కేవలం సుప్రీంకోర్టు స్టేషన్‌లో మాత్రమే మెట్రో సేవలు ప్రభావితం అవుతాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు స్టేషన్ తప్ప మిగతా అన్ని స్టేషన్లలో మెట్రో సేవలు సాధారణంగానే కొనసాగుతాయని... కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రం భద్రతా నిబంధనల ప్రకారం 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేయవచ్చని తెలిపారు.
-
Every Indian is proud that India is hosting the G20 summit this year. In addition, the Delhi Metro has begun branding the G20 summit at Mandi House Metro Station as a mark of respect for the forthcoming historic G20 summit.#G20India #DelhiMetro pic.twitter.com/8G8XX1IvTB
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Every Indian is proud that India is hosting the G20 summit this year. In addition, the Delhi Metro has begun branding the G20 summit at Mandi House Metro Station as a mark of respect for the forthcoming historic G20 summit.#G20India #DelhiMetro pic.twitter.com/8G8XX1IvTB
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) September 4, 2023Every Indian is proud that India is hosting the G20 summit this year. In addition, the Delhi Metro has begun branding the G20 summit at Mandi House Metro Station as a mark of respect for the forthcoming historic G20 summit.#G20India #DelhiMetro pic.twitter.com/8G8XX1IvTB
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) September 4, 2023
భద్రత కోసం దిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సమావేశాలు జరిగే వేదికల వద్ద రక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, సాఫ్ట్‌వేర్ అలారాలు, డ్రోన్లు పహారా కాయనున్నాయి. అదనపు భద్రత కోసం ఎత్తైన భవనాల వద్ద NSG కమాండోలు, ఆర్మీ స్నైపర్లను మోహరించారు. అనుమానాస్పద డ్రోన్ల కూల్చివేతకు NSG... భారత వైమానిక దళం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోనుంది. దిల్లీ గగనతలంపై రఫేల్, మిరాజ్-2000, సుఖోయ్-30MKI యుద్ధ విమానాలను మోహరించనున్నారు. భద్రతా ఏర్పాట్లపై అన్ని భద్రతా సంస్థలతో సమన్వయం చేసేందుకు వాయుసేన ప్రత్యేక ఆపరేషన్స్ డైరెక్షన్ సెంటర్‌ని ఏర్పాటు చేసింది.
జీ 20 సదస్సుకు హాజరయ్యే విదేశీ అతిథుల భద్రత కోసం 120 వాహనాలను సీఆర్పీఎఫ్కు అందజేశారు. వీటిలో 45 బుల్లెట్ ఫ్రూఫ్ కార్లున్నాయి. వీటిని ప్రత్యేకంగా పలు దేశాల అధ్యక్షుల రక్షణకు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ఉన్న వీఐపీ బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు నడిపేందుకు 450 మంది సీఆర్పీఎఫ్ డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. మరోవైపు గురుగ్రామ్ కంపెనీలకు సెప్టెంబర్ 8నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను అమలు చేయాలని పోలీసులు సూచించారు. దిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించింది. దుకాణాలు, వ్యాపారాలు, వాణిజ్య సంస్థల యజమానులు.. తమ ఉద్యోగులు, కార్మికులకు సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో వేతనంతో కూడిన సెలవులను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Worlds Tallest Nataraja Statue Delhi : 19 టన్నులు.. 8 లోహాలు.. భారీ నటరాజ విగ్రహం.. దిల్లీకి పయనం