ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా? - కేరళ

Family Found Dead: తన భార్య, ఇద్దరు పిల్లలతో ఓ ఐటీ నిపుణుడు ఇంట్లోనే మృతి చెంది కనిపించటం కేరళలోని త్రిస్సూర్​లో సంచలనంగా మారింది. అయితే, ఇది ఆత్మహత్యా లేక మరో కోణమేదైనా ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

FOUR OF A FAMILY FOUND DEAD
ఒకే కుటుంబంలో నలుగురు మృతి
author img

By

Published : Feb 20, 2022, 8:50 PM IST

Family Found Dead: నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో మృతి చెంది కనిపించటం కేరళలోని త్రిస్సూర్​లో కలకలం సృష్టించింది. కొడుంగలూర్​కు చెందిన ఐటీ నిపుణుడు ఆసిఫ్​(41), ఆయన భార్య అబీరా(38), పిల్లలు అజ్రా ఫాతిమా(14), ఐనున్నీసాలు (7) వారి ఇంట్లోని ఒకే గదిలో విగతజీవులుగా కనిపించారు. ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఎవరూ వారిని చూడలేదు. బంధువులు వచ్చి చూడగా చనిపోయినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న కొండగలూర్​ పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. విషపూరితమైన కార్బన్​ మోనాక్సైడ్ విషవాయువును పీల్చటం ద్వారానే వారి మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. గదిలో ఈ వాయువు అనవాళ్లు కనిపించటమే అందుకు కారణం.

మరోవైపు.. ఇది ఆత్మహత్య కేసుగా భావిస్తున్నారు పోలీసులు. అసిఫ్​కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ​

ఇదీ చూడండి: ఫేస్​బుక్​లో ప్రేమ.. కాసేపట్లో పెళ్లి​.. అంతలోనే వరుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.