చరిత్రలో తొలిసారిగా రేపు (మంగళవారం) 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా కారణంగా ముందు నిర్ణయించిన సుప్రీంకోర్టు 1వ ప్రాంగణంలో కాకుండా అదనపు భవనం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒకేసారి 9 మంది జడ్జిల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం..
గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించారు. సంప్రదాయంగా అయితే సీజేఐ కోర్టు రూమ్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.
9 మంది కొత్తవారితో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి 33కు చేరుతుంది.
కొత్త జడ్జిలు వీరే..
జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ మాధుర్య త్రివేది, జస్టిస్ శ్రీనర్సింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు.
ఇదీ చూడండి: తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తికే అవకాశం?