ETV Bharat / bharat

కరోనాతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. దీంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

family died due to corona
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
author img

By

Published : Apr 17, 2021, 5:26 AM IST

మహారాష్ట్ర నాసిక్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనాతో మృతిచెందారు. వారం రోజుల్లోనే ఈ మరణాలు సంభవించిన నేపథ్యంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు స్థానికులు. యేవలా తాలుకాలోని రాజపుర్​లో ఈ ఘటన జరిగింది. ఉమ్మడి కుటుంబంలో తల్లి మలన్​బాయి జాదవ్​(75), మలన్​ కొడుకు అరుణ్​ జాదవ్​(58), మనమడు అమిత్​ జాదవ్​(35) పెద్ద కుమార్తె శోభాసాద్వి (60) రెండో సోదరి ఛాయావాగ్​(59) మరణించారు.

తల్లిని చూడటానికి వచ్చి..

తొలుత మలన్​బాయి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తల్లిని పరామర్శించడానికి ఇద్దరు కుమార్తెలు.. ముంబయి నుంచి రాజపుర్​కు వెళ్లారు. వెళ్లిన రెండోరోజే వారూ అనారోగ్యం పాలయ్యారు. ఆ కుటుంబంలో మిగిలిన వారు వైరస్​ బారిన పడ్డారు. దీంతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించి.. మలన్​బాయి, అరుణ్​, అమిత్​లు ముందుగా చనిపోయారు. తర్వాత మిగిలిన ఇద్దరు కొవిడ్​కు బలయ్యారు. దీంతో కుటుంబానికి చెందిన బంధువులు సహా గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: 'మహా' విలయం: ఒక్కరోజే 63వేల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.