ETV Bharat / bharat

ఆక్సిజన్ కొరతతో ఐదుగురు కరోనా రోగులు మృతి - ప్రైవేట్​ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత

మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఐదుగురు కొవిడ్​ రోగులు మృతిచెందారు. దీంతో మృతుల కుటుంభసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

oxygen shortage
ఆక్సిజన్ కొరత
author img

By

Published : Apr 23, 2021, 7:47 PM IST

Updated : Apr 23, 2021, 7:54 PM IST

మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విషాదం జరిగింది. ఆక్సిజన్​ కొరతతో గెలాక్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

'ఆక్సిజన్​ కొరత లేదు'

అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం.. తమ ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్​ ఉందని తెలిపింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చన్నారు వైద్యులు. గతంలోనూ ఈ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగి ఐదుగురు మరణించారని మృతుల కుటుంభసభ్యులు ఆరోపించారు. రోగులతో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

ఇదీ చదవండి : 'ఆపరేషన్ ఆక్సిజన్'లో వాయుసేన సాయం

Last Updated : Apr 23, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.