ETV Bharat / bharat

శశికళ 'టేపుల' కలకలం- అన్నాడీఎంకేలో చీలిక తప్పదా?

ఏఐఏడీఎంకేలో చేరి.. మళ్లీ చక్రం తిప్పాలని మాజీ ముఖ్యమంత్రి నెచ్చెలి జయలలిత శశికళ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా లీకైన ఆడియో క్లిప్పులు ఆమె మనసులోని అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అయితే ఆ ఆడియో టేపుల్లో ఏముంది? మళ్లీ ఆమె పార్టీలో చేరే అవకాశం ఉందా? ఏఐఏడీఎంకే శ్రేణులు ఆమెను రాజమాతగా అంగీకరిస్తారా? ఆమె వైపు వెళ్లే ఎమ్మెల్యేలు ఎంత మంది? తమిళనాడు ఈటీవీ భారత్​ బ్యూరో చీఫ్​ ఎంసీ రాజన్​ విశ్లేషణ.

sasikala
శశికల
author img

By

Published : Jun 17, 2021, 4:03 PM IST

"నేను వస్తాను. అన్నీ సరి చేస్తాను. పార్టీ దారి తప్పింది. ఇకపై అలాంటివి అనుతించేది లేదు." అంటూ.. మొదలైన మాజీ ముఖ్యమంత్రి నెచ్చెలి జయలలిత శశికళ ఆడియో టేపుల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అన్నాడీఎంకేను కుదిపేస్తోంది. శశికళతో మాట్లాడిన 17మందిపై వేటు వేసిన మరుసటి రోజే.. ఆమె ఆడియో క్లిప్పింగులు సోషల్​ మీడియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం.

ఇటీవల జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తీవ్ర నిరాశలో ఉన్న పార్టీ నాయకత్వాన్ని మరింత ఒత్తిడికి లోను చేసి.. దాని ద్వారా ప్రయోజనం పొందాలని శశికళ ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. తద్వారా ఏఐఏడీఎంకేలో తిరిగి చేరి.. మళ్లీ చక్రం తిప్పాలని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

థేని జిల్లాకు చెందిన ఓ ఏఐఏడీఎంకే నాయకుడితో శశికళ మాట్లాడినట్లు ప్రచారం జరుగుతున్న ఆడియో సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే పగడ్బందీ వ్యూహంతోనే శశికళ ఆ ఆడియో క్లిప్పులను లీక్​ చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓ వెలుగు వెలిగారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఆమె నెచ్చెలి శశికళ ఓ వెలుగు వెలిగారు. పార్టీలో నంబర్​ 2 స్థానంలో కొనసాగారు. మళ్లీ పార్టీలో మళ్లీ చక్రం తిప్పాలని జైలు నుంచి విడుదలైన మరుసటి రోజు నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తన మేనల్లుడు టీటీవీ దినకరన్​ను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ఆశించిన స్థాయిలో దినకరన్​ పార్టీ రాణించలేకపోయింది. ఈ క్రమంలో ఆయన రాజకీయ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక లాభం లేదు అనుకున్న శశికళ.. స్వయంగా ఆమెనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న పార్టీ నాయకత్వంలో అలజడిని సృష్టించి.. తనవైపు నేతలను మళ్లించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఏఐఏడీఎంకే నాయకులతో ఫోన్​లో మాట్లాడినట్లు స్పష్టమవుతోంది.

ఆడియో టేపుల్లో ఏముంది?

మంగళవారం లీకైన ఆడియో క్లిప్పుల్లో శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే అవి పార్టీని చీల్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

  • పళనిస్వామి, పన్నీర్​సెల్వం మధ్య విబేధాలను మరింత పెంచేలా ఆ ఆడియో టేపులో వ్యాఖ్యలు ఉన్నాయి. దీని ద్వారా ఓపీఎస్​ను తనవైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
  • పన్నీర్​సెల్వంకు సానుకూలంగా మాట్లాడినట్లు ఆ ఆడియో టేపుల ద్వారా స్పష్టమవతోంది. 2017లో ఓపీఎస్​ రాజీనామా విషయాన్ని కూడా ప్రస్తావించారు శశికళ. అప్పుడు రాజీనామా చేయకపోతే ఆయనే సీఎంగా కొనసాగేవారని చెప్పుకొచ్చారు.
  • గౌండర్​ వర్గానికే ఈపీఎస్​ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఏఐఏడీఎంకేను ఆ వర్గానికి చెందిన పార్టీగా అభివర్ణించారు. పార్టీలోని కీలక పదవుల్లో వారే ఉన్నారని చెప్పుకొచ్చారు.
  • ఏఐఏడీఎంకే ఏ ఒక్కరి పార్టీ కాదని, ఇది అన్ని వర్గాలకు చెందిన పక్షమని ఆమె వివరించారు. ఎన్నికల్లో ఓటమికి మొత్తం ఈపీఎస్​నే బాధ్యుడ్ని చేసినట్లు మాట్లాడారు.

పార్టీ స్వరూపమే మారిపోయింది

తిరిగి ఏఐఏడీఎంకేలో చేరాలన్న ఆమె కల ఎంతవరకు నెరవేరుతుందనేది ఇక్కడ ప్రశ్న. ఆమె ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయలలిత మరణం.. శశికళ జైలుకు వెళ్లడం.. వెనువెంటనే జరిగాయి. ఈ క్రమంలో పార్టీలో అనేక మార్పులు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ స్వరూపమే మారిపోయింది. చాలా మంది నాయకులుగా ఎదిగారు. ఈ క్రమంలో శశికళ ప్రయత్నం ఫలించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

"గతాన్ని తలుచుకొని శశికళ బాధపడుతున్నారు. వ్యక్తి స్వామ్యానికి అలవాటు పడిన ఏఐఏడీఎంకే శ్రేణులు.. ఎంజీఆర్​, జయలలిత తర్వాత తనను నమ్ముతారని ఆమె భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట వెళ్లకపోవచ్చు. అలా వెళ్లి పదవిని చేతులారా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దినకరన్​తో వెళ్లిన 18 మంది ఎమ్మెల్యేల గతే వారికి పడుతుందని భయపడతారు. "

-బాబు జయకుమార్, సీనియర్ జర్నలిస్ట్

ఇదిలా ఉంటే శశికళను వ్యక్తిత్వం లేని మనిషిగా అభివర్ణించారు ఏఐఏడీఎంకే సీనియర్​ నేత, మాజీ మంత్రి షణ్ముఖం. ఆమెకు పార్టీలో తలుపులు మూసివేసినట్లు చెప్పుకొచ్చారు. ఎండిన చేప అయినా బతికి రావొచ్చు కానీ.. శశికళ తిరిగి పార్టీలోకి రాలేరని ఆయన తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: తమిళనాట శశికళ 'రీఎంట్రీ' దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.