ETV Bharat / bharat

భర్త మరణంతో ఒంటరై.. కష్టపడి బస్సు డ్రైవరై.. ఆదర్శంగా ప్రియాంక ప్రయాణం!

కష్టపడి పనిచేస్తే సాధించనిదంటూ ఏదీ ఉండదు అనే దానికి ఈమె నిదర్శనం. అందరిలా కాకుండా భిన్నమైన రంగంలోకి వెళ్లి దానిలో విజయం సాధించింది ఆ మహిళ. సాధారణంగా ఆడవాళ్లు కార్లు, ఆటోలు, బైక్​లు నడపడం చూస్తుంటాం. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా బస్సు నడిపేస్తున్నారు. అంతేకాదు, ఏకంగా ఆర్​టీసీలో డ్రైవర్​గా ఉద్యోగం సంపాదించారు.

First woman driver in up
Priyanka Sharma Driver
author img

By

Published : Dec 25, 2022, 8:21 PM IST

Updated : Dec 25, 2022, 9:19 PM IST

భర్త మరణంతో ఒంటరై.. కష్టపడి బస్సు డ్రైవరై

ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కేవలం మగవారికే పరిమితం అనుకున్న భారీ వాహనాలను నడుపుతూ ఔరా అనిపిస్తోంది. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. కేవలం వంటింటికే పరిమితమనుకుంది. భర్త ఆకస్మిక మరణంతో పిల్లల బరువు బాధ్యత మీద పడింది. ఆ కష్టమే నేడు ఆమెను ఆదర్శ మహిళగా నిలిపింది. తన పిల్లలను అన్నీ తానై చూసుకుంది. కేవలం మగవారే డ్రైవింగ్ చేస్తారనే.. అపోహను తన విజయంతో చెరిపేసింది. అనేక పోరాటాలను అధిగమించిన ప్రియాంక శర్మ.. రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది.

First Women Driver in UP
ప్రియాంక శర్మ

ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26 మంది మహిళా డ్రైవర్లలో.. అనేక పోరాటాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి మహిళా ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా ఎంపికైంది లఖ్​నవూకు చెందిన ప్రియాంక శర్మ. వివాహం తర్వాత తన భర్త మద్యపానానికి అలవాటు పడి అనారోగ్యం పాలయ్యాడు. కొద్దిరోజులకే అతడు మరణించడం వల్ల జీవితం కష్టంగా మారిపోయింది. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలున్నారు. వారి బాధ్యత అంతా తన మీద పడడం వల్ల కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఒక ప్రైవేటు ట్రాన్స్​పోర్ట్​లో హెల్పర్​గా చేరిన ప్రియాంక.. అక్కడే డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత ఉద్యోగ రీత్యా ముంబయికి మారింది. ప్రైవేటు ట్రాన్స్​పోర్ట్​లో డ్రైవర్​గా చేరి బంగాల్​, అసోం లాంటి పలు రాష్ట్రాలకు వెళ్లింది. మహిళా డ్రైవర్లకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

First Women Driver in UP
ప్రియాంక శర్మ

"భర్త చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యతలన్నీ నా మీదే పడ్డాయి. పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండడం వల్ల ప్రైవేటు ట్రాన్స్​పోర్ట్​లో సహాయకురాలిగా పని చేశాను. ఆ సమయంలోనే డ్రైవింగ్ నేర్చుకున్నాను. 2020లో ప్రభుత్వం మహిళా డ్రైవర్ల కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల దానికి దరఖాస్తు చేసుకున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత 2022 మేలో శిక్షణ పొంది సెప్టెంబర్‌లో పోస్టింగ్ పొందాను. మాకు వచ్చే జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ సంస్థ అధికారుల నుంచి నాకు మంచి సహకారం లభిస్తోంది."- ప్రియాంక శర్మ

Last Updated : Dec 25, 2022, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.