Firecracker Accident In Karnataka : కర్ణాటక-తమిళనాడులో సరిహద్దులో అత్తిబెలె గ్రామంలోని బాణసంచా గోదాంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆదివారం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శక్కరపాణి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణ్యంను స్టాలిన్ ఆదేశించారు.
అంతకుముందు శనివారం రాత్రి ఘటనాస్థలాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఈ 'అగ్నిప్రమాదం వార్త విని నేను చాలా బాధపడ్డాను.. ఆదివారం ఘటనాస్థలిని పరిశీలిస్తానుట అని సోషల్‌మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ మీడియాతో మాట్లాడారు. "అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గోదాంలో 35 మంది పనిచేస్తున్నారు. షాప్ యజమానితోపాటు అతడి కుమారుడిని అరెస్టు చేశాం. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నాం. దర్యాప్తులో అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలుస్తుంది" అని చెప్పారు.
-
#WATCH | Karnataka DGP Alok Mohan says "This is a cracker shop. The fire started yesterday in the afternoon and 14 people lost their lives in the fire incident. We will take up the investigation in the right way. A total of 5 people are accused in the case and 2 people have been… https://t.co/vlUfMxnOVo pic.twitter.com/rlgLivGGe5
— ANI (@ANI) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Karnataka DGP Alok Mohan says "This is a cracker shop. The fire started yesterday in the afternoon and 14 people lost their lives in the fire incident. We will take up the investigation in the right way. A total of 5 people are accused in the case and 2 people have been… https://t.co/vlUfMxnOVo pic.twitter.com/rlgLivGGe5
— ANI (@ANI) October 8, 2023#WATCH | Karnataka DGP Alok Mohan says "This is a cracker shop. The fire started yesterday in the afternoon and 14 people lost their lives in the fire incident. We will take up the investigation in the right way. A total of 5 people are accused in the case and 2 people have been… https://t.co/vlUfMxnOVo pic.twitter.com/rlgLivGGe5
— ANI (@ANI) October 8, 2023
ఇదీ జరిగింది..
శనివారం సాయంత్రం 7 గంటలకు అత్తిబెలె గ్రామంలో ఉన్న బాలాజీ క్రాకర్స్‌లో చిన్న మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు వేగంగా వ్యాపించడం వల్ల గోదాం మొత్తం దహనమైంది. ప్రమాద సమయంలో గోదాంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నారు. వీరిలో నలుగురు తప్పించుకున్నారు. బాణసంచా లోడ్‌ను లారీ నుంచి గోదాంలోకి దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే గోదాం సమీపంలో ఉన్న అనేక వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఈ దుర్ఘటనలో శనివారం 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు ఆదివారం మృతిచెందారు. అయితే మృతులంతా తమిళనాడుకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో 8 మంది ధర్మపురి జిల్లా హరూర్ మండలం అమ్మపెట్టై గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు కల్లకురుచ్చి జిల్లాకు చెందిన వారుగా, ఇక మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించలేదని చెప్పారు.
బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి
Cracker Factory Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం