ETV Bharat / bharat

మరో రైలులో అగ్నిప్రమాదం- 19 మందికి గాయాలు

Fire In Train Etawah Uttar Pradesh : దిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న వైశాలీ ఎక్స్​ప్రెస్​ రైలులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు.

Fire In Train Etawah Uttar Pradesh
Fire In Train Etawah Uttar Pradesh
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 9:36 AM IST

Updated : Nov 16, 2023, 10:10 AM IST

Fire In Train Etawah Uttar Pradesh : దిల్లీ-సహర్సా వైశాలీ ఎక్స్​ప్రెస్​ రైలులో మంటలు చెలరేగి 19 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావాలో గురువారం వేకువజామున 2.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం దిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న హమ్​సఫర్ ఎక్స్​ప్రెస్​.. ఇటావా జిల్లాలోనే భారీ అగ్నిప్రమాదానికి గురైన కొద్దిగంటలకే ఈ ఘటన జరగడం గమనార్హం.

ప్రమాదం జరిగిన సమయంలో.. వైశాలీ ఎక్స్​ప్రెస్ దిల్లీ నుంచి బిహార్​లోని సహర్సాకు వెళ్తోంది. ఇటావాలో ఫ్రెండ్స్ కాలనీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని.. మైన్​పురి అండర్​బ్రిడ్జ్​ సమీపంలోకి రాగానే ఎస్​-6 బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. లోకోపైలట్ వెంటనే రైలును ఆపేశారు. ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు దూకి.. రైలుకు దూరంగా పరుగెత్తారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శకటాలను ఉపయోగించి కాసేపటికే మంటల్ని అదుపులోకి తెచ్చారు. మరో రైలును ఏర్పాటు చేసి.. ప్రయాణికుల్ని ఇటావా రైల్వే స్టేషన్​కు తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Fire In Train Etawah Uttar Pradesh

ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారందరినీ సైఫాయీ ఆస్పత్రికి తరలించారు.
"ప్యాంట్రీ పక్కన ఉన్న బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వారిని మరో ఆస్పత్రికి తరలించాం." అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

హమ్​సఫర్​ రైలులో మంటలు..
బుధవారం సాయంత్రం దిల్లీ-దర్భంగా ఎక్స్​ప్రెస్​ రైలులో అగ్నిప్రమాదం జరిగి 8 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ ఇటావాలోని సరాయ్​ బోపత్ రైల్వే స్టేషన్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలులోని ఎస్​-1 బోగీ నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. లోకోపైలట్​ను అప్రమత్తం చేసి, రైలును ఆపారు. ఈలోగా మంటలు తీవ్రమై.. బోగీ మొత్తానికి వ్యాపించాయి. కాసేపటికే పక్కనున్న రెండు బోగీలకూ అంటుకున్నాయి. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. మంటలు ఆర్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Bihar Train Accident 2023 : 'భారీ కుదుపులు.. ప్రయాణికుల అరుపులు.. కళ్లు తెరిచిచూసేసరికి పొలాల్లో..'

రైలులో భారీ అగ్నిప్రమాదం- ప్రయాణికులు సేఫ్​!

Last Updated : Nov 16, 2023, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.