ETV Bharat / bharat

ఓ వైపు చితిమంటలు.. మరోవైపు డీజే స్టెప్పులు.. ఎక్కడంటే?

celebrations at crematorium: ఓవైపు చితిమంటలు మండతుండగానే.. మరోవైపు డీజే పాటలకు స్టెప్పులు, పాటల సందడి ఉండటం ఎప్పుడైనా గమనించారా? శవాలను కాల్చుతున్న ప్రాంతంలోనే నృత్యాలతో హోరెత్తించే ఉత్సవం ఒకటుంది. 300 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందంటే నమ్ముతారా? ఇంతకీ ఈ ఉత్సవాలు ఎక్కడ నిర్వహిస్తారంటే..

festival-celebration
శ్మశానంలో నృత్యాలు
author img

By

Published : Apr 9, 2022, 12:58 PM IST

Updated : Apr 9, 2022, 1:46 PM IST

శ్మశాన్​ నాథ్​ ఆలయం వద్ద యువతులు నృత్యాలు

celebrations at crematorium: అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో శ్మశానంలో వాతావరణం మొత్తం బంధువుల ఆర్తనాదాలు, కన్నీటితో నిండిపోయి ఉంటుంది. కానీ, ఉత్తర్​ప్రదేశ్​, వారణాసిలోని మణికర్ణిక ఘాట్​ (కాశీ శ్మశానవాటిక) వద్ద డీజే పాటలు, డ్యాన్సులు కనిపించాయి. ఓవైపు చితి మంటలు మండుతూనే ఉన్నాయి.. మరోవైపు సంతోషంగా ఉత్సవాలు నిర్వహించారు. బాబా భోలేనాథ్​ ముందు నగర్​వధువులు(నృత్యకారులు) డ్యాన్సులు చేశారు. వారిపై కొందరు నోట్ల వర్షం కురిపించారు.

shamshan
నృత్యాలు చేస్తున్న యువతులు

అలా ఎందుకు చేస్తారు?: ఇలా చితి మంటల మధ్య నృత్యాలు, ప్రార్థనలు చేసే సంప్రదాయం 378 ఏళ్లుగా వస్తున్నట్లు బాబా మహాశ్మశాన్​ నాథ్​ ఆలయ అధికారి గుల్షాన్​ కపూర్​ తెలిపారు. " ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. బాబా మహాశ్మశాన్​ నాథ్​ ఆలయాన్ని రాజా మాన్​సింగ్​ పునర్నిర్మింమించారు. అయితే, ఆలయంలో పాటలు పాడటం, నృత్యాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాజా మాన్​సింగ్​ కలత చెందారు. ఈ విషయం నగరం మొత్తం వ్యాపించింది. సంస్థానంలోని నగర్​వధువులకు ఈ విషయం తెలిసింది. ఈ అవకాశం తమకు ఇస్తే నగరంలోని నృత్యాకారులంతా బాబా ముందు ప్రదర్శన చేసేందుకు వస్తారని రాజుకు తెలియజేశారు. వెంటనే వారికి అవకాశం కల్పించారు రాజు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నడుస్తోంది." అని తెలిపారు కుల్షాన్​.

shamshan
చితిమంటల పక్కనే వేడుకలు

ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తే తమకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని నగర్​వధువు(నృత్యకారులు)లకు ఆలోచన వచ్చినట్లు తెలిపారు గుల్షాన్ కపూర్​. అందుకే వందల ఏళ్లు గడుస్తున్నా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారని చెప్పారు. చైత్ర నవరాత్రి తర్వాత ఏడో రోజు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నగర్​వధువులు మణికర్ణిక ధామ్​కు చేరుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు. మహాశ్మశాన్​నాథ్​ బాబా ఉత్సవాలు శవాలు కాలుతుండగానే నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఉత్సవాలు చూసేందుకు నగరవాసులతో పాటు ఇతరులు సైతం వస్తారు. అక్కడి ఘాట్​లో ఇలాంటి కార్యక్రమంలో చూడటం ఇదే తొలిశారని కొందరు తెలిపారు.

festival-celebration
చితిమంటల పక్కనే నిర్వహిస్తున్న ఉత్సవాలు

ఇదీ చూడండి: ఆశారాం బాపు ఆశ్రమం వద్ద బాలిక మృతదేహం.. కారులోనే కుళ్లిపోయి..

Last Updated : Apr 9, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.